గోషామహల్ ఎమ్యెల్యే అభ్యర్థి కిడ్నాప్ !  

Goshamahal Mla Candidate Kidnaped-

ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం ఎన్నికల వేళ సహజమే కానీ … ఏకంగా… ఎన్నికల బరిలో అందులోనూ ఎమ్యెల్యే అభ్యర్థిగా.పోటీ చేస్తున్న వారిని కిడ్నాప్ చేయడం అందులోనూ ఈ సంఘటన హైదరాబాద్ లో జరగడం కలకలం రేపుతోంది.

వివరాలు పరిశీలిస్తే…

Goshamahal Mla Candidate Kidnaped-

గోషామహల్‌లో బీఎల్‌ఎఫ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న ట్రాన్సజెండర్ చంద్రముఖిని కిడ్నాప్‌ చేశారు.ఇందిరాగనర్‌లో నివాసం ఉంటున్నచంద్రముఖి ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు మరో ట్రాన్సజెండర్ ఫిర్యాదు చేయడంతో… బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

దీనిపై పూర్తి స్థాయి విచారణకు పోలీసులు రంగంలోకి దిగారు.

.

తాజా వార్తలు