ఖరీదైన కారును చూపించిన శాంతి స్వరూప్.. పరువు తీసిన గెటప్ శ్రీను?

జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లతో పేరు, పాపులారిటీని సొంతం చేసుకున్న శాంతి స్వరూప్ ఈ షో ద్వారా పరవాలేదనిపించే స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.శాంతిస్వరూప్ వేసే పంచ్ లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో చాలామంది శాంతి స్వరూప్ కు లేడీ గెటప్ బాగా సూట్ అవుతుందని కామెంట్లు చేస్తారు.

 Getup Srinu Shocking Comments On Jabardasth Comedian Shanti Swaroop Thar Car, Ev-TeluguStop.com

శాంతి స్వరూప్ ప్రాపర్టీస్, కార్ల గురించి గతంలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి.

శాంతి స్వరూప్ కు ఆడి కారు ఉందని కూడా వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం.

అయితే తన దగ్గర ఆడీ కార్ ఉందని వచ్చిన వార్తల్లో నిజం లేదని శాంతి స్వరూప్ పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చారు.శాంతి స్వరూప్ కు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉండగా ఆ ఛానల్ ద్వారా కూడా శాంతి స్వరూప్ కు బాగానే ఆదాయం వస్తుందని తెలుస్తోంది.

శాంతి స్వరూప్ వీడియోలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

Telugu Evemts, Getup Srinu, Lady Getup, Scooty, Thar Car-Movie

ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న శాంతి స్వరూప్ సొంతంగా స్కూటీ తప్ప మరేం లేదని గతంలో చెప్పుకొచ్చారు.అయితే తాజాగా మహ్రీంద్రా తార్ కారుకు సంబంధించి రివ్యూ ఇచ్చిన శాంతి స్వరూప్ ఆ కారు గురించి ఇతర జబర్దస్త్ కమెడియన్ల ఒపీనియన్ ను తెలుసుకునే ప్రయత్నం చేశారు.అయితే గెటప్ శ్రీను మాత్రం కారు చాలా బాగుందని ఆ కారు నీ కారు కాదని తెలుసని చెప్పుకొచ్చారు.

Telugu Evemts, Getup Srinu, Lady Getup, Scooty, Thar Car-Movie

ఆ తర్వాత శాంతి స్వరూప్ నిజంగా కారును కొనుగోలు చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.జబర్దస్త్ కమెడియన్లకు ఆ షో కంటే ఈవెంట్ల ద్వారా బాగా డబ్బులు వస్తున్నాయి.మరి భవిష్యత్తులో జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ నిజంగా కారు కొంటాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube