దేవి నాగవల్లిపై సెటైర్లు వేసిన గెటప్ శ్రీను.. ఆ పదాన్ని వాడటంతో?

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో నెట్టింట వైరల్ కాగా కొంతమంది విశ్వక్ సేన్ ను సపోర్ట్ చేస్తే మరి కొందరు మాత్రం విశ్వక్ సేన్ ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.ఆ తర్వాత ప్రముఖ్ న్యూస్ ఛానల్ లో దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.

 Getup Srinu Satires On Devi Nagavalli Goes Viral In Social Media , Satya , Getup Srinu , Happy Birthday , Lavanya Tripathi , Vennala Kishore, Devi Nagavalli,lavanya Tripathi, Naresh Agastya-TeluguStop.com

ఆ తర్వాత దేవి నాగవల్లితో గొడవ పెట్టుకుంటే సినిమా సక్సెస్ సాధిస్తుందని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

అయితే లావణ్య త్రిపాటి, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమా జులై 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

 Getup Srinu Satires On Devi Nagavalli Goes Viral In Social Media , Satya , Getup Srinu , Happy Birthday , Lavanya Tripathi , Vennala Kishore, Devi Nagavalli,Lavanya Tripathi, Naresh Agastya-దేవి నాగవల్లిపై సెటైర్లు వేసిన గెటప్ శ్రీను.. ఆ పదాన్ని వాడటంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీను న్యూస్ రీడర్ గా నరేష్ అగస్త్య, సత్య, వెన్నల కిషోర్ హ్యాపీ బర్త్ డే సినిమాలో నేను హీరో అంటే నేను హీరో అంటూ గొడవ పడే వ్యక్తులుగా వీడియో రిలీజ్ చేశారు.అయితే ఈ వీడియోలో గెటప్ శ్రీను దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ సెటైర్లు వేయడం గమనార్హం.

గెటప్ శ్రీను న్యూసెన్స్ టీవీ అంటూ తన పేరు దేవి ప్రసాద్ థమన్ అంటూ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత గెటప్ శ్రీను సత్యపై వాటర్ బాటిల్స్ విసురుతూ దేవి నాగవల్లిని ఇమిటేట్ చేశారు.

వెన్నెల కిషోర్ ఒక పదాన్ని వాడటంతో గెట్ ఔట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ గెటప్ శ్రీను పంచ్ లు వేయడం గమనార్హం.షూటింగ్ కోసం యూరప్ కు వెళ్లిన వెన్నెల కిషోర్ యూరప్ నుంచి డిబేట్ లో పాల్గొన్నారు.

సినిమాలో నా క్యారెక్టర్ గొప్ప అంటే నా క్యారెక్టర్ గొప్ప అంటూ సత్య, వెన్నెల కిషోర్, నగేష్ అగస్త్య గొడవ పడ్డారు.వైరల్ అవుతున్న వీడియో సినిమాపై అంచనాలను పెంచింది.ఈ సినిమాతో లావణ్య త్రిపాఠి ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది.పవన్, నేను, మహేష్ ప్రైవేట్ పీపుల్ అని వెన్నెల కిషోర్ కామెంట్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube