తినడానికి తిండి లేక అలా చేసిన గెటప్ శ్రీను.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను ఏ స్కిట్ చేసినా ఆ స్కిట్ల ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.సుడిగాలి సుధీర్ స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడానికి గెటప్ శ్రీను కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

 Getup Srinu Opens About His Financial Troubles In His Initial Days-TeluguStop.com

సోషల్ మీడియాలో సైతం గెటప్ శ్రీను తెగ యాక్టివ్ గా ఉండటంతో సినిమాలలో గెటప్ శ్రీను చేస్తున్న పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఎంటర్టైన్మెంట్ అందిస్తుండటం గమనార్హం.

జబర్దస్త్ జడ్జిగా గతంలో పని చేసిన నాగబాబు సైతం గెటప్ శ్రీను టాలెంట్ గురించి పొగిడిన సంగతి తెలిసిందే.

 Getup Srinu Opens About His Financial Troubles In His Initial Days-తినడానికి తిండి లేక అలా చేసిన గెటప్ శ్రీను.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే జబర్దస్త్ లోకి రాకముందు గెటప్ శ్రీను పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.గెటప్ శ్రీను తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు ఎన్నో కష్టాలను అనుభవించారు.

తినటానికి తిండి లేకపోతే కడుపు మాడ్చుకుని పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి.మొదట శ్రీను కొన్నిరోజులు పిన్ని ఇంట్లో ఉన్నారు.

Telugu Economical Problems, Financial Troubles, Getup Srinu, Getup Srinu Before Jabardasth, Initial Days, Jabardasth Comedian, Nagababu, Sudigaali Sudheer-Movie

పగలంతా పని కొరకు వెతుక్కుని పిన్ని ఆప్యాయతతో పెట్టే భోజనాన్ని గెటప్ శ్రీను తినేవారు.కొన్నిరోజుల తర్వాత పిన్ని కుటుంబానికి భారం కావడంతో ఆ తర్వాత మ్యాగీ అనే స్నేహితుని దగ్గరకు వెళ్లాడు.ప్రస్తుతం మ్యాగీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుండటం గమనార్హం.నాగోల్ లో ఉండే షెడ్డులో శ్రీను ఉండేవారు.కొన్ని రోజులు బన్స్ తెచ్చుకుని కడుపు నింపున్న రోజులు కూడా ఉన్నాయి.

Telugu Economical Problems, Financial Troubles, Getup Srinu, Getup Srinu Before Jabardasth, Initial Days, Jabardasth Comedian, Nagababu, Sudigaali Sudheer-Movie

ఒకానొక సమయంలో బస్సులో వెళ్లడానికి శ్రీను దగ్గర రూపాయి కూడా లేదు.ఒకచోట దానిమ్మ పిందెలు ఉండటంతో చివరకు నోరు పిందెలా తయారై పుండ్లు వచ్చాయి.జబర్దస్త్ షోలో అడుగుపెట్టిన తర్వాత గెటప్ శ్రీను మంచి రెమ్యునరేషన్ ను అందుకోవడం గమనార్హం.

ప్రస్తుతం గెటప్ శ్రీను పారితోషికం లక్షల రూపాయలు ఉంది.

#Getup Srinu #Initial Days #Nagababu #GetupSrinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు