అప్పట్లో విమానం చూస్తూ చిరంజీవి అని అరచిన గెటప్ శ్రీను.. సంస్కారమంటూ?

బుల్లితెర కమల్ హాసన్ గా పేరును సొంతం చేసుకున్న గెటప్ శ్రీనుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.గెటప్ శ్రీను నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.

 Getup Srinu Comments About Travelling With Chiranjeevi Details Here ,getup Srinu-TeluguStop.com

టాలెంట్ ఉన్న నటీనటులను ప్రోత్సహించే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.రీఎంట్రీలో చిరంజీవి తను హీరోగా తెరకెక్కిన సినిమాలలో గెటప్ శ్రీనుకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు.

అయితే గెటప్ శ్రీను తాజాగా చిరంజీవి గురించి చిరంజీవిపై తనకు ఉన్న అభిమానం గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాల్యంలో ఆకాశంలో ఎగిరెళ్లే విమానాన్ని చూసి చిరంజీవి బై అని గట్టిగా అరిచేవాడినని అప్పటినుంచి చిరంజీవిపై అభిమానాన్ని పెంచుకుంటూ పెరిగానని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.

 Getup Srinu Comments About Travelling With Chiranjeevi Details Here ,getup Srinu-TeluguStop.com

ఎప్పటికైనా యాక్టర్ కావాలని చిరంజీవి గారితో ఫోటో దిగాలని నా సంకల్పం అని నాగబాబు గారి రూపేనా జబర్దస్త్ షో ద్వారా నా పేరు చిరంజీవి గారి దగ్గర వినిపించిందని గెటప్ శ్రీను తెలిపారు.

అప్పటినుంచి అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో చిరంజీవి నాకు ఛాన్స్ ఇస్తున్నారని గెటప్ శ్రీను వెల్లడించారు.చిరంజీవిగారు ఆయన స్థాయి గురించి ఆలోచించకుండా ప్రైవేట్ జెట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నన్ను తీసుకెళ్లారని గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.అలా తీసుకెళ్లడం చిరంజీవి సంస్కారం అని ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్ లో వెళ్లడం నిజమైన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని గెటప్ శ్రీను కామెంట్లు చేశారు.

గెటప్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గెటప్ శ్రీను జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చి ఆ షో ద్వారా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

గెటప్ శ్రీనును అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube