మల్లెమాలతో సుడిగాలి సుధీర్ గొడవపై గెటప్ శ్రీను క్లారిటీ.. అందుకే నిర్ణయం?

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ మనందరికీ సుపరిచితమే.జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్, ఆ తరువాత బుల్లితెరపై పలు చిత్రాలలో అవకాశాలు సాధించి దూసుకుపోతున్నాడు.

 Comedian Getup Srinu About Sudigali Sudheer Controversy With Mallemala, Sudigali-TeluguStop.com

ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కేవలం సుధీర్ కోసమే చూసే వారు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే సుధీర్ స్కిట్ లకు మిలియన్ వ్యూస్ వస్తుంటాయి.

అంతేకాకుండా సుధీర్ కు బుల్లితెరపై బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉంటే సుధీర్ జబర్దస్త్ ను విడిచి బయటకు వచ్చేసాడు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఈ విషయం తెలిసిన సుధీర్ ఫ్యాన్స్ నిజంగానే సుదీర్ జబర్దస్త్ ను వీడాడా? అన్న సందేహాలు మొదలయ్యాయి.జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

అంతేకాకుండా వెండి తెరపై కూడా అవకాశాలు అందుకున్నారు.సుధీర్ కూడా వెండితెరపై అవకాశాలు అందుకుని హీరోగా సినిమాలు చేసినప్పటికీ జబర్దస్త్ ని మాత్రం వీడలేదు.

Telugu Getup Srinu, Getupsrinu, Etv Channel, Jabardasth, Mallemala, Sudheer, Sud

పలు సందర్భాలలో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను మాత్రం వీడే ప్రసక్తే లేదని తెలిపాడు సుధీర్.అయితే సోషల్ మీడియాలో సుధీర్ జబర్దస్త్ విడిచి పెడుతున్నాడన్న వార్తలపై. జబర్దస్త్ కమెడియన్ సుదీర్ స్నేహితుడు గెటప్ శ్రీను స్పందించారు.సుధీర్ జబర్దస్త్ ని వీడుతానని అనలేదని కొంచెం గ్యాప్ తీసుకునిరా అని మాత్రమే చెప్పాడు అంటూ తెలిపాడు.అందుకు గల కారణాలు కూడా వివరించారు.ప్రస్తుతం సుధీర్ రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, మరొక వైపు ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలు చేస్తుండటంతో సుధీర్ బాగా బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ కి కాస్త గ్యాప్ తీసుకుంటాను అని తెలిపాడు అంటూ జబర్దస్త్ శ్రీను చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube