కష్టాలలో జబర్దస్త్ కమెడియన్.. సాయం చేయమని వేడుకున్న గెటప్ శ్రీను!

ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటీనటులు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూనే మరోవైపు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి తమ వంతు సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారు.ఇలా స్టార్ సెలబ్రెటీల నుంచి చిన్న సెలబ్రిటీల వరకు వారికి తోచిన సహాయం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు.

 Getup Seenu Viral Photo In Social Media , Getup Srinu , Photto Viral , Help , J-TeluguStop.com

ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ ఇలాంటి సహాయాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.ఇదివరకే కష్టాలలో ఉంటూ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడిన జబర్దస్త్ కమెడియన్ కి సుడిగాలి సుదీర్, హైపర్ ఆది,రాంప్రసాద్ రష్మీ వంటి తదితరులు వీలైనంత సహాయం చేసి అతనికి చికిత్స అందించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రాజమండ్రికి చెందిన ఆనంద్ అనే ఒక యువకుడు వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.ఈ క్రమంలోనే అతనికి ఆపరేషన్ చేయడం కోసం సుమారు 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు.

కానీ అంత డబ్బు పెట్టుకునే అంత స్తోమత వారి కుటుంబానికి లేకపోవడంతో ఎవరైనా దాతలు సహాయాన్ని కోరుతున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను ఈ విషయంపై స్పందిస్తూ తాను 20 వేల రూపాయలు సహాయం చేసినట్లు ఫోటోని షేర్ చేస్తూ తన అభిమానులు సహాయం చేయమని వేడుకున్నారు.

Telugu Getup Srinu, Hyper Adi, Jabardasth, Photto, Ramprasad, Rashmi-Movie

మనం మానవత్వంతో ఒకటైతే ఒక ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అంటూ తాను సహాయం చేసిన విషయాన్ని తెలియజేస్తూ మరి కొంత మందికి సహాయం చేయాలని అభిమానులను వేడుకున్నారు.ఇలా ఒక వ్యక్తి ప్రాణాల కోసం గెటప్ శీను పడే ఆవేదన చూసి కొంత మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube