నెయ్యితో వీటిని కలిపి తీసుకుంటే చాలు.. గొంతు నొప్పి దగ్గు జలుబు నుంచి ఉపశమనం..!

మారిన వాతావరణం గాలి నాణ్యత వల్ల ప్రజలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవడానికి ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.

దీనీ ద్వారా మీరు ముక్కు మూసుకుపోవడం, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి ఉపశమనం పొందుతారు.ఇందులో దేశీ నెయ్యి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

దేశి నెయ్యి( Ghee ) కఫం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.దీనివల్ల ముక్కు మూసుకుపోయే సమస్య దూరం అవుతుంది.

నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

ఇది ఇన్ఫెక్షన్ల ను దూరం చేయడంలో ఎంతగానో పనిచేస్తుంది.కానీ నెయ్యిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే జలుబు సమయంలో నెయ్యి, ఓమా కలిపిన పాలను( Ajwain and Ghee ) తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

పాలను వేడి చేసి దానిలో ఒక చెంచా నెయ్యి అలాగే కాస్త ఓమా కలపాలి.రాత్రి నిద్రపోయే ముందు ఈ పాలను త్రాగాలి.ఈ నెయ్యి శరీర ఉష్ణోగ్రతను రక్షిస్తుంది.

నెయ్యి నల్ల మిరియాల టీ( Ghee Pepper tea ) తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు చిటికెల ఎండు మిర్చి, కొద్దిగా అల్లం కలపాలి.కాసేపు మరిగించి వడగట్టిన తర్వాత తాగడం మంచిది.

నెయ్యి, నల్ల మిరియాలు యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలను కలిగి ఉంటాయి.దీన్ని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు త్వరగా తగ్గుతుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఇంకా చెప్పాలంటే ముక్కు మూసుకుపోయినట్లయితే రెండు చుక్కల గోరువెచ్చని నెయ్యిని ముక్కులో వేస్తే ముక్కు తెరుచుకుంటుంది.నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

ఈ లక్షణాలు ముక్కులో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

తాజా వార్తలు