ఇక 48 గంటల్లోనే పాస్పోర్ట్..!!   Get Passports Under 48 Hours At All Indian Missions Now Says VK Singh     2018-11-27   16:11:06  IST  Surya

వాషింగ్టన్ లోని భారత రాయభార కార్యాలయంలో శనివారం “పాస్పోర్ట్ సేవా” విభాగాన్ని విదేశాంగ శాఖా సహాయ మంత్రి వీకే సింగ్ ప్రారంభించారు.. ఈ నూతన పద్దతి వలన ప్రపంచ వ్యాప్తంగా భారత కాన్సులేట్లలో కేవలం 48 గంటల్లోనే పాస్పోర్ట్ జారీ అవుతుందని ఆయన తెలిపారు..వివరాలలోకి వెళ్తే..

నూతన “పాస్‌పోర్టు సేవ” కేంద్రం ప్రారంభించిన సందర్భంగా వీకే సింగ్ మాట్లాడుతూ..తమ పాస్‌పోర్టు ఆఫీసులన్నీ ఇండియాలో ఉన్న డేటా కేంద్రానికి డిజిటల్‌గా కనెక్ట్ అయ్యాయని ఆయన అన్నారు..దాంతో పాస్‌పోర్టుల జారీ విధానం మరింత వేగంగా అవుతుందని ఆయన తెలిపారు..

గతంలో పాస్పోర్ట్ రావాలంటే కొంత సమయం పట్టేదని కాని ఈ ప్రక్రియతో పాస్పోర్ట్ జారీ వేగవంతం అవుతుందని ఆయన అన్నారు.. ముందుగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో 48 గంటల్లోనే పాస్‌పోర్టు జారీ చేశారని..ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఇదే విధంగా జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.