పెట్రోల్ పోయించుకుంటే ఫ్రీ బిర్యానీ.. ఎక్కడంటే?

ఈ మధ్య కాలంలో ఏ బిజినెస్ సక్సెస్ సాధించాలన్నా పబ్లిసిటీ చాలా అవసరం.పబ్లిసిటీ లేకపోతే ఎలాంటి వ్యాపారమైనా సక్సెస్ కాలేదు.

 Get Free Biryani For Petrol-TeluguStop.com

కొందరు పబ్లిసిటీ ద్వారానే వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటే మరికొందరు వివిధ సందర్భాలను బట్టి తమ వ్యాపారాలకు పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటూ ఉంటారు.ఇందుకోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు.

తాజాగా బెంగళూరులోని ఒక పెట్రోల్ బంక్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 Get Free Biryani For Petrol-పెట్రోల్ పోయించుకుంటే ఫ్రీ బిర్యానీ.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెట్రోల్ పోయించుకున్నవారికి ఫ్రీగా బిర్యానీ అందజేస్తామని పేర్కొంది.

ఓల్డ్ మద్రాసు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సర్వీస్ స్టేషన్ ఈ ఆఫర్ ను ప్రకటించింది.తమ పెట్రోల్ బంకును ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తైందని.

దీంతో ఈ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెబుతున్నారు.ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు పెట్రోల్ పోయించుకున్న వారికి బిర్యానీ ప్యాకెట్లను అందజేస్తారు.

అయితే పెట్రోల్ బంక్ నిర్వాహకులు బిర్యానీ ప్యాకెట్ పొందడానికి కొన్ని షరతులు పెట్టారు.ఫ్రీగా బిర్యానీ పొందాలనుకునే వినియోగదారులు 2 వేలకు పైగా పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని.250 రూపాయల కంటే ఎక్కువగా పెట్రోల్ లేదా డీజిల్ ను కొనుగోలు చేస్తే వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు.ఈ ఆఫర్ ప్రారంభమైన రోజు నుంచి నెల రోజులు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

బిర్యానీలలో వెజ్, నాన్‌వెజ్ వెరైటీలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.ఈ పెట్రోల్ బంకుకు మరో రికార్డ్ కూడా ఉంది.కర్ణాటకలో ఎక్కువ పెట్రోల్, డీజిల్ అమ్మిన పెట్రోల్ బంక్ కూడా ఇదే కావడం గమనార్హం.ఆఫర్ ముగిసిన తర్వాత కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరకే వినియోగదారులకు ఇస్తామని పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలుపుతున్నారు.

#Bangalore #Lockdown #Madras #Biryani #IOC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు