Web Whatsapp Call History : వెబ్‌ వాట్సాప్‌లో కాల్‌ హిస్టరీ ఇలా చూసేయొచ్చు!

వాట్సాప్ గురించి తెలియని మనిషి ఇక్కడ ఉండడంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు వున్నారు.

 Get Whatsapp Call History On Web Whatsapp, Whatsapp,web Whatsapp,desktop Version-TeluguStop.com

దాంతో వాట్సాప్ ఎప్పటికప్పుడు అనేకరకాల కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నాయి.ఇపుడు తాజాగా ఓ అద్భుతమైన ఫీచర్ రాబోతోంది.

కొద్ది రోజుల క్రితం డెస్క్‌టాప్‌ యాప్‌లో స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన సంగతి మీకు గుర్తుందా? తాజాగా డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.దీంతో మొబైల్‌ యాప్‌లో మాదిరి యూజర్లు ఇకపై డెస్క్‌టాప్‌లో కూడా వాట్సాప్ కాల్ హిస్టరీని యాక్సెస్‌ చేయొచ్చు.

సూపర్ కదూ.నిత్యం అనేకమంది యూజర్లు అవసరం నిమిత్తం డెస్క్‌టాప్‌ వెర్షన్ వినియోగిస్తున్నారు.దాంతో వాట్సాప్‌ వరుసగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.ఈమధ్య కాలంలో కమ్యూనిటీస్, కాల్‌ లింక్‌, గ్రూప్‌ లిమిట్‌ వంటి ఫీచర్లను పరిచయం చేసిన సంగతి విదితమే.ఇక ఇవ్వి కేవలం మొబైల్‌ యాప్‌లోనే కాకుండా, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కూడా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేయడానికి కృషి చేస్తోంది.

ఇటీవలే డెస్క్‌టాప్‌ యాప్‌ కోసం స్క్రీన్‌ లాక్‌ పేరుతో ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Telugu Desktop, App, Web Whatsapp, Whatsapp, Whatsapp Beta-Latest News - Telugu

తాజాగా డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుండడం విశేషం.దీంతో మొబైల్‌ యాప్‌లో మాదిరి యూజర్లు ఇకపై డెస్క్‌టాప్‌లో కూడా వాట్సాప్ కాల్ హిస్టరీని చాలా తేలికగా యాక్సెస్‌ చేయొచ్చు.ప్రస్తుతం విండోస్‌ 2.2246.4.0 వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకొని బీటా యూజర్లు ఈ ఫీచర్‌ను ట్రై చేయొచ్చు.త్వరలోనే సాధారణ యూజర్లు కూడా దీనిని వాడుకొనే వెసులుబాటు కలదు.

కొత్తగా తీసుకొస్తున్న కాల్స్‌ ఫీచర్‌ పైన ఉన్న చాట్స్‌ లిస్ట్‌, స్టేటస్‌ మధ్యలో ఉంటుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube