అమెజాన్ మెంబర్‌షిప్ ఫ్రీగా వస్తుందంటే ఎవరికి చేదు.అయితే ఈ మెంబర్‌షిప్ పొందాలంటే కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి వున్నాయి.
మరెందుకాలస్యం, ఆలోచన ఆశాభంగం.విషయంలోకి వెళితే, ఇది అమెజాన్ అందిస్తున్న అరుదైన ఆన్‌లైన్ షాపింగ్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి.2022 జూలై 23, 24 తేదీల్లో జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో నచ్చిన వస్తువు కొని, వచ్చిన ఆఫర్ వినియోగించుకోండి.అయితే ఇందులో అమెజాన్ మెంబర్‌షిప్ ఫ్రీ ఆఫర్ కూడా ఉంది.
అయితే ఇక్కడ ఓ నిబంధన వుంది.అమెజాన్ ప్రైమ్ సభ్యులు మాత్రమే ఈ సేల్‍లో పాల్గొనాలి.
ఇతరులు కూడా ఈ సేల్‌లో పాల్గొనేందుకు ఆ సంస్థ మొబైల్ వినియోగదారులకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది.కేవలం మొబైల్‌ని రీచార్జ్ చేసుకుని అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందే ప్లాన్‌ని తీసుకొచ్చింది.ఇపుడు దానిగురించి తెలుసుకుందాం.
1.Airtel Rs.359 పోస్ట్ పెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది.అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.దానితోపాటుగా రోజుకు 2 జీబీ డేటా, 100 SMSలు లభిస్తాయి.ఈ తరహాలోనే ఎయిర్‌టెల్ కస్టమర్లు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు.499, 699, 999, 1199, 1599 లాంటి ప్లాన్ లు కూడా తీసుకోవచ్చు.
2.Jio Rs.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్:

ఇక ఈ ప్లాన్ గనుక తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సైతం ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.75జీబీ డేటా వాడుకోవచ్చు.అలాగే రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు జియో ప్లాన్ జాబితా.599, 399, 799, 1499 లాంటి ప్లాన్‌లు కూడా ట్రై చేయొచ్చు.
3.Vi Rs.999 postpaid plan:

ఈ ప్లాన్ తీసుకుంటే 6నెలల వరకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది.అన్‌లిమిటెడ్ కాల్స్, 220 GBడేటా, రోజు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.ఇక ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు వొడాఫోన్ ప్లాన్ జాబితా.
చూసుకుంటే, 499, 699, 999, 1099, 1299,1699, 2299 లాంటి ప్లాన్‌లు కూడా ట్రై చేయొచ్చు.