‘‘ బీర్ తాగండి..హెయిర్ కట్ చేయించుకోండి.. వ్యాక్సిన్ తీసుకోండి’’... బైడెన్ నోట కొత్త పిలుపు

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంకణం కట్టుకున్నారు.అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఫోకస్ మొత్తం కరోనా మీదనే.

 Get A Shot, Have A Beer: Bidens Push To Boost Covid Vaccination Rate, Joe Biden,-TeluguStop.com

అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.

మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.

దాన్ని కూడా 10 రోజుల ముందే.అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.

ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయినప్పటికీ పలువురు అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోకుండా మొహం చాటేస్తున్నారు.కొన్ని రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ స్థాయిల్లో కూడా తగ్గింపు కనిపిస్తోంది.ముఖ్యంగా యువత టీకా తీసుకునేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు.ఈ క్రమంలో మళ్లీ యువత అడుగులు వ్యాక్సిన్లవైపు పడేలా చేయడం కోసం బైడెన్ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం డేటింగ్ యాప్‌ల సహకారం తీసుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.తాజాగా తనలోని ఉపన్యాస కళ ద్వారా యువతను దారిలో పెట్టేందుకు ప్రయత్నించారు.

Telugu Corona, Covid, Joe Biden-Telugu NRI

దీనిలో భాగంగా సరికొత్త పిలుపునిచ్చారు.‘బీర్ తాగండి.హెయిర్ కట్ చేయించుకోండి.మీ వ్యాక్సిన్ తీసుకోండి’ అంటూ సందేశమిచ్చారు.కరోనాపై పోరులో అమెరికన్లు ప్రభుత్వానికి సహకరించాలని.వ్యాక్సిన్‌ను ప్రతి వ్యక్తికీ ఇస్తున్నామని, వైరస్ పట్టు నుంచి మనం విముక్తులం కావలసి ఉందని బైడెన్ స్పష్టం చేశారు.

కనీసం ఈ సంవత్సరమైనా దేశంలో మెరుగైన, ఆరోగ్యకరమైన పరిస్థితి నెలకొనేలా చేద్దామని బైడెన్ పిలుపునిచ్చారు.ప్రస్తుతం అమెరికాలో 63 శాతం మంది పెద్దలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకోగా.12 రాష్ట్రాల్లో డెబ్బై శాతానికి పైగా ప్రజలు టీకా వేయించుకున్నారు.మార్చి 2020 తర్వాత తొలిసారి అమెరికాలో రోజువారీ కేసులు 20,000 కన్నా తక్కువగా నమోదవ్వగా.

మరణాల రేటు 85 శాతానికి పడిపోయిందని బైడెన్ పేర్కొన్నారు.అటు వ్యాక్సిన్ తీసుకున్నవారికి పలు రాష్ట్రాలు లాటరీ పోటీలు పెట్టి విజేతలకు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీగా ఇస్తున్నాయి.

మరోవైపు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కోవిడ్‌‌తో అల్లాడుతున్న వివిధ దేశాలకు 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది.ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube