పదేళ్ల పాటు ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ పొందండిలా

యుక్త, నడి వయసులో ఉన్న ప్రజలు స్టాక్ మార్కెట్ల వంటి రిస్క్ తో కూడిన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయగలరు.ఒకవేళ ఇందులో పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయినా మళ్లీ వారు డబ్బు సంపాదించుకోగలరు.

 Get A Pension Of Rs 10,000 Every Month For Ten Years,  Pension , Rs 10,000 Every-TeluguStop.com

కానీ 60 లేదా అంతకన్నా పెద్దవారు రిటైర్‌మెంట్ తర్వాతి జీవితం కోసం దాచుకున్న డ‌బ్బును రిస్క్‌తో కూడుకున్న ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టలేరు.నిజానికి ఇలాంటి పథకాలకు వారు వీలైనంత దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

అయితే వీరు మంచి రాబ‌డి, ప్ర‌భుత్వ హామీ అందించే ప‌థ‌కాల‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక భద్రత పెంచుకోవచ్చు.ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది కానీ ఒక పథకం మాత్రం సీనియర్ సిటిజన్లకు అన్నిటిలోకెల్లా ఆకర్షణీయంగా నిలుస్తోంది.అదే ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎమ్‌వీవీవై) పథకం.60 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న సిటిజన్లు ఈ పథకంలో చేరి 10 ఏళ్ల పాటు నెలనెలా పింఛను అందుకోవచ్చు.

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.ఆన్‌లైన్ ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా గానీ ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి గానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు/ కొనుగోలు చేయవచ్చు.ఇప్పుడు 7.40 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోన్న ఈ పథకంలో 60 ఏళ్లు, 60 ఏళ్ల పైబడిన వారు చేరేందుకు అర్హులు.

Telugu Lacs Policy, Lic Policy, Senor Citizens-Latest News - Telugu

కేసారి ప్రీమియం చెల్లించి పీఎమ్‌వీవీవై పాలసీలో చేరవచ్చు.అయితే సీనియర్ సిటిజన్లు కనీసం రూ.1.50 లక్షలు చెల్లించి పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.గరిష్ఠంగా రూ.15 లక్షలతో కూడా పాలసీ కొనచ్చు.చెల్లింపులకు చెక్కు, డీడీ యూజ్ చెయ్యొచ్చు.

Telugu Lacs Policy, Lic Policy, Senor Citizens-Latest News - Telugu

పీఎమ్‌వీవీవై కింద, సీనియర్ సిటిజన్ సబ్‌స్క్రైబర్ రూ.15 లక్షలకు ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా 10 ఏళ్ల పాటు ప్రతినెలా రూ.10 వేల నెలవారీ పింఛను పొందవచ్చు.అంతేకాదు 10 ఏళ్లు పూర్తయిన తర్వాత మీరు కట్టిన రూ.15 లక్షలను కూడా తిరిగి పొందవచ్చు.పదేళ్ల పాలసీ గడువుతో వచ్చే ఈ పథకంలో రూ.15 లక్షల ప్లాంక్ కొనుగోలు చేసుకుంటే.7.4 వార్షిక వడ్డీ రేటుతో మీరు ప్రతి నెలా రూ.9250 పెన్షన్ గా పొందొచ్చు.ఒకవేళ భవిష్యత్తులో వార్షిక వడ్డీ రేటు 8 శాతం అయినట్లయితే మీరు నెలకు రూ.10 వేలు అందుకోవచ్చు.ఒక్కసారి పాలసీ కొన్న తర్వాత వచ్చే పదేళ్లపాటు పింఛన్ పొందొచ్చు.

ఒకవేళ ఈ పదేళ్ల కాల వ్యవధిలో మరణించినట్లయితే.నామినీ డెత్ బెనిఫిట్ పొందవచ్చు.

ఇంకా సరెండర్ వాల్యూ, లోన్ ఫెసిలిటీ ఇలాంటి తదితర ఆర్థిక ప్రయోజనాలను కూడా అందుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube