ఛీఛీ.. సాస్‌ బాటిల్‌లో బల్లి తల..?

ఏంటి ? సాస్ బాటిల్ లో బల్లి తలనా ? ఛీఛీ.వింటుంటేనే కంపరంగా ఉంది కదా! బల్లిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.

 Lizard In Sauce, Lizard In Bolognese Sauce, Lizard Head In Sauce, Germany, Germa-TeluguStop.com

అలాంటిది తినే సాస్ లో బల్లి పడిందంటే ఎంత దారుణం అసలు.ఛీఛీ అలాంటి ఆహారాన్ని తింటే జీవితంలో తినడం మానేస్తాం.

ఇంకా ఈ ఘటన జర్మనీకి చెందిన ఓ కుటుంబంలో చోటుచేసుకుంది.

జర్మనీలోని పాలీ వీటన్ అనే 47 ఏళ్ల మహిళకు 20 ఏళ్ల వయస్సు గల ఇసాబెల్లే, మెగాన్ అనే కవల పిల్లలు ఉన్నారు.

ముగ్గురు కలిసి ఇటీవల టిఫిన్ చేస్తుంటే ఇసాబెల్లే ప్లేటులో ఏదో వింతగా కనిపించింది.మార్కెట్లో కొన్న వెగన్ బొలోగ్నీజ్ సాస్‌ను తింటున్న ఆమెకు ప్లేట్ లో ఏదో ఒక ముక్క కనిపించింది.

దీంతో ఆమె ఆ ముక్క ఏంటా? అని కదిపి చూసింది.అదేంటో చుసిన ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది.

ఎందుకంటే ఆ ముక్క బల్లి తల.అవును.

అప్పటివరకు ఆమె బల్లి తల ఉన్న సాస్ ని తినింది.అది తెలియగానే ఆమె వాంతులు చేసుకుంది.

దీంతో ఆ సాస్ లో ఉన్న బల్లి ఫోటోను తీసి అధికారులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాదు ఈ ఘటనను అంత కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ బల్లి తల బొటనవేలు సైజులో ఉన్నట్టు తెలిపిన ఆమె దాన్ని విక్రయించిన సూపర్ మార్కెట్ నిర్వాహకులను విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.ఇంకా ఈ ఘటన జరిగిన సమయం నుంచి ఇసాబెల్లే తినాలి అంటేనే భయపడుతోందని విటన్ తెలిపింది.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube