జర్మనీ యువతికి అమెరికా కోర్టులో శిక్ష...ఎందుకంటే..!!!  

German Woman Gets Sentence In Us Court-billionaire,german,telugu Nri Updates,us Court,women,శిక్ష

కోట్లకి పడగెత్తిన అమ్మాయికి అమెరికా జైలు శిక్ష విధించడం ఏమిటి.?? పై కోర్టుని ఆశ్రయించవచ్చు, బెయిల్ తీసుకుని బయటకి రావచ్చుగా అందుకు తగ్గ డబ్బు, హోదా ఉంటాయి కదా అనే సందేహం రాక మానదు..

జర్మనీ యువతికి అమెరికా కోర్టులో శిక్ష...ఎందుకంటే..!!!-German Woman Gets Sentence In US Court

కానీ కోటీశ్వరురాలు అయిన ఆ అమ్మాయికి కనీసం సొంతగా ఒక కారు కూడా లేదు, కటిక పేదరికం నుంచీ వచ్చింది.

మరి కోర్టు ఎందుకు శిక్ష విధించింది. అసలు ఆ అమ్మాయి ఏమి చేసింది అనే వివరాలలోకి వెళ్తే…ఆమె పేరు అన్నా సోరోకిన్‌ జర్మనీకి చెందిన ఈ యువతి తానూ బిలీనియర్ కి వారసురాలిని అంటూ అమెరికాలో ఎంతో సంపన్న స్నేహితులని , హోటళ్ళని , బ్యాంక్ లని మోసం చేసింది. ఇలా దాదాపు రెండు లక్షల డాలర్లు వారినుంచీ సేకరించింది.

అయితే ఈ విషయంపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకి ఆమెని పట్టుకున్నారు. తన తండ్రి రష్యాకి చెందినా ట్రక్కు డ్రైవర్ అని ఆమె తెలిపింది.

చిన్నతనం నుంచీ ఆమెకి గొప్ప ధనవంతురాలిగా బ్రతకడం ఇష్టమని అందుకే జర్మనీ నుంచీ అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేసింది.

ఎంతో హుందాగా, ఖరీదైన దుస్తులు ధరిస్తూ కోటీశ్వరురాలిగా అందరికి పరిచయం చేసుకుంది. అంతేకాదు నకిలీ డాక్యుమెంట్లతో చూపించి అమెరికా బ్యాంకుల నుంచీ సుమారు 22 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. చివరికి కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరించింది.