అరెరె: ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా ల్యాప్ టాప్ ను ఎత్తుకుపోయిన పంది… ఇక ఆపై…?!  

German Man chases pig that stolen laptop bag , Laptop, Pig, German, Social media, Viral Photos - Telugu Bathing, German, German Man Chases Pig That Stolen Laptop Bag, Germany, Laptop, Pig, Social Media, Socila Media, Viral, Viral Photos

జర్మనీ దేశంలో చాలా నదులు, చెరువులు లలో ఒంటి మీద నూలు పోగు లేకుండా సన్ బాత్, అలాగే స్విమ్మింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ అనుమతి ఇచ్చింది.అక్కడ స్థానికంగా ఈ విధానాన్ని ” ఫ్రీ బాడీ కల్చర్ ” అని పిలుస్తారు.

TeluguStop.com - German Man Chases Pig Stolen Laptop Viral Photos

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా జర్మనీ దేశంలోని బెర్లిన్ నగరానికి దగ్గరగా ఉన్న ఓ నది వద్ద వ్యక్తి నగ్నంగా… ఓ అడవి పంది వెనక పరిగెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీనికి కారణం లేకపోలేదు.

TeluguStop.com - అరెరె: ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా ల్యాప్ టాప్ ను ఎత్తుకుపోయిన పంది… ఇక ఆపై…-General-Telugu-Telugu Tollywood Photo Image

సదరు వ్యక్తి తాను నదిలో స్నానం చేయడానికి వెళ్లేముందు, నది ఒడ్డున ఓ బ్యాగులో ల్యాప్ టాప్ ను ఉంచి స్నానానికి వెళ్ళాడు.ఆయన ఆ ల్యాప్ టాప్ ను అక్కడ పెట్టి అలా వెళ్లాడో లేదో, అడవి పంది తన ఇద్దరు పిల్లలు వేసుకుని అటుగా వచ్చింది.

ఆ అడవి పంది అక్కడ పెట్టిన సంచిలో ఏదో ఆహారం ఉందని భావించి దాని నోటికి కరచుకుని పరిగెత్తింది.

ఇక అంతే తన ల్యాప్ టాప్ ను తీసుక వెళ్తున్న పందిని పట్టుకోవడానికి ఆ వ్యక్తి నగ్నంగా వాటి వెంట పరిగెత్తాడు.

అయితే ఆ సమయంలో అక్కడ అనేక మంది టూరిస్టులు కూడా ఉన్నారు.అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని అందరూ చూసి పకపకా నవ్వుకున్నారు కూడా.అలా అడవి పంది కొంత దూరం సంచిని ఎత్తుకు వెళ్ళిన తర్వాత దాన్ని ఓ చోట వదిలేసి అక్కడి నుంచి పరారైంది.అయితే ఈ మధ్యలో జరిగిన సన్నివేశాన్ని ఓ మహిళ, ఆ వ్యక్తి నగ్నంగా పరిగెత్తుతున్న ఫోటోలను తీసింది.

అయితే ఇక్కడ విడ్డూరం ఏమంటే… ఆ ఫోటోలు తీసిన మహిళ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తన ఫోటోలను చూపించగా అతను బొల్లున నవ్వాడు.ఆ తర్వాత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చా అని అడగగా… ఆమెకు అతడు చూపించమని తెలిపారు.

దీంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సదరు వ్యక్తి ల్యాప్ టాప్ తీసుకున్న తర్వాత… ల్యాప్ టాప్ ఎక్కడ పగిలిపోతుందో అన్న ఖంగారు లో తను డ్రెస్ వేసుకోవడం కూడా మర్చిపోయానని తెలిపాడు.

దీంతో స్థానికులు ఆయనకు చప్పట్లు కొట్టి మరి కంగ్రాట్స్ చెప్పారు.

#Laptop #Viral #GermanMan #Social Media #German

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

German Man Chases Pig Stolen Laptop Viral Photos Related Telugu News,Photos/Pics,Images..