జార్జిరెడ్డి కోసం ఇప్పుడు మెగాస్టార్‌, లక్కంటే వీళ్లదే  

George Reddy S Released By Chiranjeevi-george Reddy S Released

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ చాలా అధికంగా ఉంది.మొదట నాగబాబు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యలు చేశాడు.

George Reddy S Released By Chiranjeevi-george Reddy S Released Telugu Tollywood Movie Cinema Film Latest News George Reddy S Released By Chiranjeevi-george-George Reddy Songs Released By Chiranjeevi-George

ఆ సినిమా తప్పకుండా బాగుంటుందనిపిస్తుంది అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడంతో పాటు పవన్‌ లేదా వరుణ్‌ తో ఈ సినిమా చేయాలనుకున్నాను అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశాడు.

జార్జిరెడ్డి సినిమాలోని ఒక పాటను పవన్‌ కళ్యాణ్‌కు అంకితం ఇవ్వడంతో పాటు పవన్‌ను సినిమా ప్రమోషన్‌లో భాగస్వామ్యం చేసేందుకు యూనిట్‌ సభ్యులు చాలా ప్రయత్నించారు.ప్రీ రిలీజ్‌ వేడుకను భారీగా నిర్వహించి పవన్‌ను గెస్ట్‌గా పిలవాలనుకున్నారు.కాని ప్రభుత్వం నుండి అనుమతి దక్కక పోవడంతో ప్రీ రిలీజ్‌ వేడుకను క్యాన్సిల్‌ చేశారు.పవన్‌ ఆశీస్సులు బాగానే పొందిన జార్జిరెడ్డి యూనిట్‌ సభ్యులకు చిరంజీవి ఆశీస్సులు కూడా దక్కాయి.

మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా జార్జిరెడ్డి పాటను విడుదల చేయించడం జరిగింది.చిత్ర యూనిట్‌ సభ్యులు చిరంజీవిని కలిసి సినిమా విశేషాలను తెలియజేయడంతో పాటు ఆయనకు ట్రైలర్‌ మరియు పాటలను చూపించడం జరిగింది.చివరగా చిరంజీవితో పాటను విడుదల చేయించారు.సినిమా ప్రమోషన్స్‌లో మెగా బ్రదర్స్‌ అందరిని ఫుల్‌గా వాడేసుకున్న జార్జిరెడ్డికి మంచి పబ్లిసిటీ దక్కింది.

కనుక మంచి ఓపెనింగ్స్‌ కన్ఫర్మ్‌ అంటున్నారు.