ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన జార్జి రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పటి స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి నిజజీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ఈమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సహజంగా కమ్యూనిజం బావజాలం ఉన్న జార్జి రెడ్డిని చిన్న వయస్సులోనే ఎవరో అతి కిరాతకంగా యూనివర్సిటీ లోపలే హత్య చేశారు.

 George Reddy Selected International Film Festival-TeluguStop.com

అప్పటి ఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు జీవన్ రెడ్డి జార్జి రెడ్డి సినిమా సందీప్ హీరోగా తెరకెక్కించారు.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

కొంతమంది ఈ సినిమాలో నెగిటివ్గా చూపిస్తున్నారని గొడవ చేసినా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు.

ప్రేక్షకుల అభినందనలతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా 4వ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.

ఈ మేరకు డిసెంబర్ 22 మరియు 23వ తేదీల్లో ఈ చిత్రాన్ని నోయిడా, ఢిల్లీలో ప్రదర్శించనున్నారు.ఈ మధ్య కాలంలో తెలుగులో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది.దానికి తగ్గట్టే చాలామంది కొంతమంది నిజ జీవిత కథను తెరపై ఆవిష్కరిస్తున్నారు.అలా వచ్చిన వాటిలో మహానటి సినిమా తర్వాత కొద్దో గొప్పో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిన సినిమా జార్జి రెడ్డి.

నిజానికి ఈ సినిమాలో వాస్తవంగా జరిగిన సంఘటనలను చూపించకపోయినా కూడా ఒక రియల్ హీరోని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తన సత్తా చూపించి సక్సెస్ అయ్యాడు.దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు భాగా నచ్చింది అని చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube