తెరపైకి విద్యార్ధి నాయకుడి బయోపిక్! జార్జిరెడ్డి... ఆ పేరులో వైబ్రేషన్

తెలంగాణలో ఉద్యమాలకి పురిటిగెడ్డ ఉస్మానియా యూనివర్సిటీ.ఎందరో నాయకులు ఉస్మానియా వర్సిటీలో విద్యార్ధి నాయకులుగా ఉద్యమాలు చేసి తరువాత రాజకీయ నాయకులుగా ఎదిగారు.

 George Reddy Biopic First Look To Release-TeluguStop.com

అయితే ఈ తెలంగాణలో విద్యార్ధి ఉద్యమాలు అన్నింటికీ స్ఫూర్తిగా ఇప్పటికి ఒక వ్యక్తి పేరు చెప్పుకుంటారు.అతనే జార్జిరెడ్డి.

ఈ పేరు ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణలో విద్యార్ధి ఉద్యమాలలో ఒక వైబ్రేషన్ పుట్టించింది.సమాజంలో ఉన్నత వర్గాలు, బలహీన వర్గాలు అనే అంతరం ఉన్న సమయంలో ఉస్మానియాలోకి విద్యార్ధిగా ప్రవేశించి తరువాత ఉద్యమాలతో సామాజిక మార్పే లక్ష్యంగా విద్యార్ధి నాయకుడుగా ఎదిగిన జార్గ్జి రెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

అతని ఎదుగుదలని భరించలేకపోయిన కొంత మంది జార్జిరెడ్డిని యూనివర్సిటీలోనే అతి కిరాతకంగా హత్య చేసారు.ఇప్పుడు విద్యార్ధి నాయకుడు జీవిత కథ తెరపైకి వస్తుంది.గతంలో దళం అనే సినిమాని తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న జీవన్ రెడ్డి రెండో ప్రయత్నంగా ఈ కథని ఎంచుకున్నాడు.ఈ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ బయోపిక్ ఫస్ట్ లుక్‌లో జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు ఈ లుక్‌ను చూస్తే అర్థమవుతోంది.చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని పోస్టర్ లో‌నే చెప్పారు.1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో జార్జి రెడ్డి ఉద్యమ ప్రస్తానం ఇందులో ఆవిష్కరించనున్నారు.టైటిల్ రోల్ లో వంగవీటి సినిమా ఫేం సందీప్ మాధవ్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube