అమెరికాకి ప్రజలకి చేదు...'వార్త'..!!  

George Herbert Walker Bush Was No More-hw Bush,nri,telugu Nri News Updates

అమెరికా అధ్యక్షులలో అత్యంత ప్రభావశీలుర జాబితాలో నిలిచే వ్యక్తులలో ఒకరు జార్జ్ హర్బెర్ట్‌ వాకర్‌ బుష్‌. ఆయన అమెరికాకి 41 అధ్యక్షుడుగా పని చేశారు.ఆయన వయస్సు 94. 1989 నుంచి 1993 వరకు అధ్యక్ష పదవిలో ఉన్న బుష్‌, అధ్యక్షుడుగా కాకముందు రెండు సార్లు అంటే “1981-1985, 1985-1989” ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహింఛి చాలా కీలక పాత్ర పోషించారు..

అమెరికాకి ప్రజలకి చేదు...'వార్త'..!!-George Herbert Walker Bush Was No More

ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. అలాంటి సముయంలో తన రాజనీతిజ్ఞతతో, ప్రచ్ఛన్న యుద్ధానికి అడ్డుకట్ట వేసిన వారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసంసలు అందుకున్నారు.

ఆయన తరువాత క్లింటన్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు..

ఇదిలాఉంటే బుష్‌ తన భార్య బార్బరా మరణించిన కొన్ని నెలలలోనే ఆయన కూడా మరినించడం వారి కుటుంభంలో తీవ్ర విషాదాన్ని నింపింది.బుష్‌కు ఐదుగురు పిల్లలు.వారిలో 17 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.అయితే జార్జ్‌ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ను ఎక్కువగా బుష్‌ 41. జార్జ్‌ బుష్‌ సీనియర్‌ అని అమెరికా ప్రజలు పిలుస్తూ ఉంటారు.బుష్‌ కుమారుడు జార్బ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా అమెరికా 43వ అధ్యక్షుడిగా పని చేయడం విశేషం.