''ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు''.... ప్రపంచాన్ని రగిలించిన మాటకు ఏడాది, జార్జ్‌ఫ్లాయిడ్‌‌కు అమెరికన్ల నివాళి

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ భారీ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.

 George Floyd Murder: First Anniversary To Be Marked By More Calls For Racial Jus-TeluguStop.com

కానీ ఆచరణలో ఇది అంతా ఎండమావిగానే కనిపిస్తుందన్నది విజ్ఞుల మాట.ఓ ప్రయోజనం, ఓ సంకల్పం నుంచి పుట్టిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దేశంలోని ఈ వివక్షను కళ్ళప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోతోంది.ఇది అమెరికా సమాజానికి తలవంపులు తెచ్చే వ్యవహారమే.అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో నల్లజాతీయుల పట్ల నేటీకీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు.శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటీకీ అక్కడ ద్వీతీయశ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.ఇక గతేడాది జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య అయితే నిలువెత్తు నిదర్శనం.

ఫ్లాయిడ్‌ను ఓ తెల్లజాతి పోలీసు కర్కశంగా హతమార్చిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది.ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.

న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణించి ఏడాది గడిచిన సందర్భంగా ఫ్లాయిడ్ కుటుంబం మంగళవారం ఒక మార్చ్ నిర్వహించింది.

మినియాపోలిస్‌లో నిర్వహించిన ఈ యాత్రలో ప్రజలు భారీగా పాల్గొని వారికి మద్దతు తెలిపారు.అనంతరం జార్జ్ ఫ్లాయిడ్‌కు నివాళులర్పించారు.ఇక అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్లాయిడ్ హత్య కేసులో అతని మరణానికి కారణమైన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్ట్ దోషిగా తేల్చింది.అతనికి జూన్ 15న శిక్ష ఖరారు చేయనుంది.

చౌవిన్‌పై మూడు కౌంట్ల నేరారోపణలు రుజువు కావడంతో అతనికి సుమారు 40 సంవత్సరాలు శిక్షపడే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు కోర్టు తీర్పుపై ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ రోజు మేం మళ్లీ శ్వాస తీసుకోగలమని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ భావోద్వేగానికి గురయ్యారు.అటు ఫ్లాయిడ్ మద్ధతుదారులు కూడా రోడ్ల మీదకు వచ్చి ‘‘న్యాయం గెలిచిందంటూ’’ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

Telugu Derek Chauin, Barack Obama, George Floyd, Joe Biden, Statue Liberty, Kama

అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.

తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.

వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube