ఊపిరాడకపోవడం వల్లే జార్జ్‌ఫ్లాయిడ్‌ మరణం: జ్యూరీకి డాక్టర్ వాంగ్మూలం, చౌవిన్ చుట్టూ ఉచ్చు

శ్వేతజాతి పోలీసుల అరాచకానికి బలైన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది.అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తి పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.

 George Floyd Died From low Level Of Oxygen: Doctor, Low Level Of Oxygen,george F-TeluguStop.com

తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.

వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

మార్టిన్ టోబిన్ అనే పల్మోనాలజిస్ట్ ఫ్లాయిడ్ కేసు విచారణ చేపట్టిన జ్యూరీ ఎదుట హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది మే 25న ఫ్లాయిడ్ అరెస్ట్ అయ్యే వీడియోను తాను కొన్ని వందల సార్లు చూసినట్లు తెలిపారు.ఆ సమయంలో చౌవిన్ దాదాపు 9 నిమిషాల పాటు ఫ్లాయిడ్ మెడపై మోకాలు అదిమిపెట్టాడని టోబిన్ పేర్కొన్నారు.

అలాగే మృతుడి ముఖం రోడ్డును తాకడంతో పాటు మిగిలిన పోలీస్ అధికారులు ఫ్లాయిడ్‌ను కదలకుండా పట్టుకోవడంతో శ్వాస వ్యవస్థ బలహీనపడిందని డాక్టర్ తెలిపారు.ఆ వీడియోలో అతని కళ్లను జాగ్రత్తగా పరిశీలిస్తే.

ఫ్లాయిడ్ స్పృహలో వున్నప్పటికీ అతని శరీరం మాత్రం అచేతనంగా మారిందని చెప్పారు.ఆ క్షణంలోనే ఫ్లాయిడ్ ప్రాణాలు వదలాడని టోబిన్ జ్యూరీకి వెల్లడించారు.

Telugu Americans, George Floyd, Georgefloyd, Level Oxygen-Telugu NRI

వీడియోలో పోలీస్ అధికారి చౌవిన్ ఎడమ కాలు భూమికి దూరంగా వుండటంతో పాటు అతని శరీర బరువులో సగం ఫ్లాయిడ్ మెడ భాగంపై పడిందని చెప్పారు.ఫ్లాయిడ్ తుది శ్వాసను విడిచిన తర్వాత కూడా సుమారు 27 సెకన్ల పాటు మోకాలు అతని మెడపైనే వుందని టోబిన్ వీడియో ద్వారా వివరించారు.ఐరిష్ సంతతికి చెందిన డాక్టర్ టోబిన్ ప్రాసిక్యూషన్‌లో నిపుణుడైన సాక్షిగా వ్యవహరిస్తున్నారు.ఫ్లాయిడ్ ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించడాని నిరూపించడానికి న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.అయితే పోలీస్ అధికారి చౌవిన్ తరపున డిఫెన్స్ మాత్రం ఫ్లాయిడ్ డ్రగ్స్, అతని అనారోగ్య పరిస్ధితుల కారణంగా జరిగిందని వాదిస్తోంది.అయితే ఆ వాదనలను టోబిన్ తోసిపుచ్చారు.

చనిపోయే సమయానికి జార్జ్ ఫ్లాయిడ్ పూర్తి ఆరోగ్యంతో వున్నట్లు ఆయన చెప్పారు.డ్రగ్స్ విషయానికి వస్తే ఫెంటానిల్ అనే ఉత్ప్రేరకం శ్వాసను పడిపోయేటట్లు చేస్తుందని.

కానీ ఫ్లాయిడ్ చనిపోయే ముందు అతని శ్వాసరేటు అసాధారణ స్థాయిలో వుందని తెలిపారు.అయితే పలువురు పోలీసులు సైతం చౌవిన్ డిపార్ట్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించారని, అతని తీరు వల్లే ఫ్లాయిడ్ చనిపోయాడని చెప్పడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube