ఫ్లాయిడ్ మృతి పై సంచలన నివేధిక,నర హత్య గా పేర్కొంటూ…  

George Floyd America Trump - Telugu America, Cardio Palmonari, Donald Trump, George Floyd, Racist Attacks, Trump Wife, White House

అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఘటన అగ్రరాజ్యాన్ని అట్టుడికేలా చేసిన విషయం తెలిసిందే.నల్ల జాతీయుడు పై వివక్ష చూపి దారుణంగా అతడి మెడపై పోలీసులు కాలు మోపి,నొక్కి పెట్టి కుదిపేసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

 George Floyd America Trump

అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే విషయం తేటతెల్లమైంది.పోలీసులు చట్టానికి విరుద్ధంగా అత్యంత దారుణంగా జార్జ్ ను హత్య చేసినట్లు నివేదికలో వెల్లడించారు.

మెడపై గట్టిగా కాలు మోపి,నొక్కి పెట్టి కుదిపేసి హత్య చేసారని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడింది.జార్జ్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని,దీనితో కార్డియో పల్మొనరీ అరెస్ట్ కు గురైనట్లు రిపోర్టు లో వెల్లడైంది.

ఫ్లాయిడ్ మృతి పై సంచలన నివేధిక,నర హత్య గా పేర్కొంటూ…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా అతడి మెడ కుదుపునకు లోనైంది.అతడి మరణాన్ని నర హత్యగా పేర్కొనవచ్చు అని పోస్టుమార్టం నివేదికలో వివరించారు.జార్జ్ మరణించిన విధానం చట్టానికి విరుద్ధంగా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, జార్జ్ ఫ్లాయిడ్ హత్య పట్ల అమెరికా అంతటా నిరసనకారుల ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి.

నిరసనకారులు ఆరు రోజులుగా రాత్రి వేళల్లో తమ నిరసన వెళ్లగక్కుతున్నారు.ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్ హౌజ్ వద్ద కూడా వేలాది మంది నిరసన చేపట్టారు.

వెంటనే అప్రమత్తమైన వైట్ హౌజ్ సిబ్బంది.ట్రంప్, ఆయన భార్య, కుమారుడిని బంకర్‌‌లోకి తరలించారు.

దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నట్లు సమాచారం.గతంలో కూడా జాతి వివక్ష దాడులు అగ్రరాజ్యం అమెరికా లో చోటుచేసుకున్నాయి.

ఆ సమయంలో కూడా పలువురు నిరసనకారులు ఇలానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి.అయినప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడ జాతి వివక్ష దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

George Floyd America Trump Related Telugu News,Photos/Pics,Images..