దిమ్మ తిరిగే షాక్.. ఒక్కసారిగా కోట్లాది కస్టమర్లను కోల్పోయిన జియో..!

భారతదేశ టెలికాం రంగంలో అనతి కాలంలోనే అగ్రగామిగా ఎదిగిన రిలయన్స్‌ జియో కాలక్రమేణా కస్టమర్లను భారీ ఎత్తున పోగొట్టుకుంటుంది.స్లో ఇంటర్నెట్, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఇష్యూలు ఇలా కారణాలేవైనా జియో రోజురోజుకీ మరింత నాసిరకమైన సేవగా మారుతోంది.

 Geo Who Lost Millions Of Customers At Once Jio, Latest News, Shock, Customer, M-TeluguStop.com

యూజర్ల ట్రాఫిక్ పెరగడం వల్ల టవర్ల సంఖ్య సరిపోక నెట్‌వర్క్ ఇష్యూలు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో చాలామంది జియో నుంచి ఎయిర్‌టెల్‌, ఐడియా వంటి నెట్‌వర్క్ లకు షిఫ్ట్ అవుతున్నారు.

దాంతో తొలిసారిగా తాజాగా జియోకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది.సెప్టెంబర్ ఒక్క నెలలోనే జియో 1.9 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిందని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడించింది.ఈ స్థాయిలో కస్టమర్లను కోల్పోవడం మామూలు విషయం కాదు.

నిజానికి గత కొద్ది నెలలుగా వరుసగా జియో తన కస్టమర్లను కోల్పోతుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా వొడాఫోన్‌ ఐడియా 10.77 లక్షల మంది కోల్పోయింది.అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్ నెలలో 2.74 లక్షల మంది యాక్టీవ్ యూజర్లను చేర్చుకుంది.ఆగస్టులో 35.41 కోట్ల మంది యూజర్లను కలిగివున్న ఎయిర్‌టెల్‌.సెప్టెంబర్‌ చివరినాటికి 35.44 కోట్ల సార్ల ను సంపాదించుకుంది.రిలయన్స్‌ జియో మాత్రం 1.90 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లను కోల్పోయి 42.48 కోట్ల యూజర్ల సంఖ్యకు క్షీణించింది.

Telugu Latest, Mukesh Ambani, Shock-Latest News - Telugu

సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ వైర్‌లెస్ సబ్‌స్ర్కైబర్ల మార్కెట్ వాటా 0.08% వృద్ధి చెందగా.రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 4.29% క్షీణించింది.కాగా నవంబర్ 26 నుంచి తన ప్రీపెయిడ్ టారిఫ్‌లను సవరించాలని నిర్ణయించుకున్నట్లు ఎయిర్‌టెల్ ఇటీవల ప్రకటించింది.దీనితో ఎయిర్‌టెల్ షేర్లు 5.8 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.755.95కి చేరుకున్నాయి.అయితే ఈ ధరల పెరుగుదల కస్టమర్ల సంఖ్య ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube