ఐపీఎల్ లో జోరు పెంచనున్న జియో ఛానెల్.. మరి స్టార్, సోనీల పరిస్థితి ఏంటి??

ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమవుతుందనగానే క్రికెట్ ప్రియుల్లో ఉత్సహం ఉరకలేస్తుంటుంది.దీనినే అదునుగా చేసుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చాలా డబ్బులను తన ఖాతాలో వేసుకుంటుంది.

 Geo Channel To Increase Momentum In Ipl .. What Is The Situation Of Star And So-TeluguStop.com

ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ లలో ఒకటిగా ఐపీఎల్ టోర్నమెంట్ గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ ఈవెంట్ బీసీసీఐకి ఓ బంగారుబాతులా మారి ప్రతియేటా కనక వర్షాన్ని కురిపిస్తుంది.

కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంఛైజీల ద్వారా 13 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇది సంపాదించింది.అహ్మదాబాద్ నుంచి సీవీసి కేపిటల్స్, లక్నో నుంచి ఆర్పీ-సంజీవ్ గోయెంకా జట్లు రావడంతో ఐపీఎల్ మ్యాచ్ ల సంఖ్య మరింత పెరగనుంది.

ప్రస్తుతం 2018-2022 మధ్య కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల కాల పరిమితి అనేది వచ్చే ఏడాది ముగిసిపోనుంది.దీనితో మరో అయిదేళ్ల కోసం బీసీసీఐ బిడ్డింగులను ఆహ్వానించింది.

ఈ క్రమంలోనే 2023-2027 మధ్య అయిదు సంవత్సరాల కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల ద్వారా కనీసం అయిదు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే స్టార్ నెట్వర్క్ సోనీ-జీ నెట్వర్క్ తో పాటు త్వరలో రానున్న జియో ఛానల్ కూడా ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భాగస్వామ్యమవుతుందని తెలుస్తోంది.

ఈ ప్రక్రియలో భాగంగా జియో ఛానెల్ తన బిడ్డింగులను ఇప్పటికే దాఖలు చేసింది.ప్రస్తుతానికి 16347.50 కోట్ల రూపాయల మేర విలువ చేసే బిడ్డింగులను అందుకుంది.

Telugu Jio Chanel, Jio Tv, Latest, Sony, Maa-Latest News - Telugu

ఈ విలువ మరింత రెట్టింపు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.క్రమంగా అనుకున్న లక్షాన్ని చేరుకోవచ్చని అంటున్నారు.మీడియా ప్రసార హక్కులకు సంబంధించిన ఈ-వేలమా లేక క్లోజ్డ్ బిడ్డింగ్ రూపంలో వెళ్లాలా అనే సందిగ్ధంలో బీసీసీఐ ఉందట.

క్లోజ్డ్ బిడ్ అయితే మంచిదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కాగా టీవీ, డిజిటల్ మీడియా హక్కుల మార్కెట్లో రెండు కంపనీల ప్రధాన పోటీ దారులు కొనసాగుతున్నారు.

ఈ రెండు కంపెనీలతో పాటు జియో ఛానల్ కూడా పోటీలో నిలవడం మరింత ఆసక్తి కలిగిస్తుంది.త్వరలో జియో ఛానల్ అందుబాటులోకి రానుంది.2023 నాటి ఐపీఎల్ సీజన్ మొదలయ్యే నాటికి జియో ఛానల్ మనుగడలోకి వస్తుంది.కాగా బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జియో ఛానల్ పోటీలో ఉండటం వల్ల మిగిలిన రెండు కంపెనీలు గట్టిపోటీని ఎదుర్కొనున్నాయి అని తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube