కర్నూలులో హోలీ రోజున చీర కట్టుకున్న యువకులు... ఎందుకో తెలుసా...?

హోలీ పండుగను ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతపు ఆచారాలను పాటించి జరుపుకుంటారనే విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో హోలీ పండుగను పురుషులు చీరలు ధరించి జరుపుకుంటారు.

 Gents Wearing Saree In Holi Festival At Kurnool District-TeluguStop.com

పురుషులు చీరలు ధరించడం వినడానికి వింతగా ఉన్నప్పటికీ కర్నూలు జిల్లాలో నిజంగానే హోలీ రోజున కొన్ని గ్రామాల్లో చీరలు కట్టుకుని పండుగ జరుపుకుంటారు.

కర్నూలు జిల్లాలోని ఒక గ్రామంలో అయితే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ పురుషుల వేషం నుండి స్త్రీ వేషంలోకి మారతారు.

పూలు పెట్టుకుని, చీరలు ధరించి ముస్తాబై పురుషులు రతీమన్మథులకు ప్రత్యేకమైన పూజలు చేసి తాము కోరుకుతున్న కోరికలు తీరాలని ఆశిస్తారు.దశాబ్దాల నుండి ఈ ప్రాంతంలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

హోలీ పండుగ రోజున చీరకట్టులో పూజలు చేస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడి పురుషులు చెబుతున్నారు.

ఆ గ్రామంలోని స్థానికులు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 200 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఈ వింత ఆచారం కొనసాగుతోందని చెబుతున్నారు.

ఈ ఆచారాన్ని పాటించటానికి ఆ మతం, ఈ మతం అనే తేడాలు ఉండవని అన్ని మతాల పురుషులు గ్రామంలో ఈ ఆచారాన్ని పాటిస్తారని గ్రామస్థులు చెబుతున్నారు.గ్రామానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం నుండి ఈ వింత ఆచారాన్ని చూడటానికి వందల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube