మెగాస్టార్‌ సరసన బొమ్మరిల్లు బ్యూటీ ఏంట్రా బాబోయ్‌!  

Genilia Act In Koratala Siva And Chiranjivi Movie-chiranjeevi And Genilia,chiranjeevi And Trisha,genilia,koratala Siva Director

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది.ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ లొకేషన్స్‌ మరియు సెట్టింగ్స్‌తో పాటు నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ నటించనున్నారట.అందులో ఒక హీరోయిన్‌గా త్రిష అంటూ బలంగా వినిపిస్తోంది.ఇక రెండవ హీరోయిన్‌ పాత్ర కోసం రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.తెలుగు అమ్మాయి నుండి బాలీవుడ్‌ అమ్మాయి వరకు ఎంతో మంది పేర్లు వినిపించాయి.

Genilia Act In Koratala Siva And Chiranjivi Movie-chiranjeevi And Genilia,chiranjeevi And Trisha,genilia,koratala Siva Director-Genilia Act In Koratala Siva And Chiranjivi Movie-Chiranjeevi Chiranjeevi Trisha Genilia Director

చిరంజీవి 152వ చిత్రంలో ఊహించని విధంగా బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియాను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినీ వర్గాల్లో ఈ విషయమై ప్రధానంగా వార్తలు వస్తున్న కారణంగా ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.మెగాస్టార్‌ చిరంజీవికి జెనీలియా జోడీ ఎంటీ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.జెనీలియాను తెలుగు ప్రేక్షకులు గతంలో చూసి ఉన్నారు.ఆమెను మళ్లీ అలాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటారు.

అలాంటిది మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకు హీరోయిన్స్‌ ఎంపిక విషయంలో నెలకొన్న సందిగ్దత అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.

వరుసగా ఖైదీ నెం.150 మరియు సైరా చిత్రాలతో ఆకట్టుకున్న చిరంజీవి మరోసారి కొరటాల మూవీతో కూడా బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం కోసం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అలాంటి చిరంజీవి జెనీలియాను ఎంపిక చేసి తప్పుడు నిర్ణయం తీసుకోడు అంటూ మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.