జనరల్ నాలెడ్జ్: ప్రపంచంలో 16 పచ్చినిజాలు దాగివున్నాయి.. తెలుసుకోండి జరా!

మనిషన్నాక కూసింత నాలెజ్డ్ ఉండాలి.ప్రపంచంలో జరిగే విషయాలపట్ల కాస్త అవాహన ఉంటే, కొన్ని విషయాలు విన్నపుడు మనం ఆశ్చర్యపోము.

 General Knowledge: There Are 16 Greens Hidden In The World 16 Facts, India, Lat-TeluguStop.com

కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మనలో ఆలోచనా శక్తి అనేది బాగా పెరుగుతుంది.ప్రతి విషయాన్నీ విశ్లేషించగలిగే సామర్థ్యం సంపాదిస్తాము.

అందుకు జనరల్ నాలెడ్జ్ ఫ్యాక్ట్స్ అనేవి కొంతవరకు ఉపయోగపడతాయి.మనిషి అనేవాడు ఓ నిరంతర విద్యార్థి.

జీవితాంతం కొత్త విషయాలూ నేర్చుకుంటూనే ఉండాలి.లేదంటే మనకి, జంతువులకు పెద్ద తేడా ఉండదు.

నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనలో బుద్ధి వికసిస్తుంది.ఒక విషయాన్ని ఎన్నో కోణాల్లో ఆలోచించగలిగే మేథో సంపత్తిని జనరల్ నాలెడ్జ్ ఇస్తుంది.

అందుకే కొంతమంది విద్యావేత్తలు మనకు విషయపరిజ్ఞానం ఉండాలని అంటారు.కాబట్టి ఇవాళ కొన్న ముఖ్యమైన జీకే ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

1.రోదసిలో ఉన్నప్పుడు వ్యోమగాములు కాస్ట్ ఎత్తు ఎక్కువగా పెరుగుతారట.

2.ప్రేమికుల రోజు నాడు దక్షిణ కొరియాలో అబ్బాయిలకు అమ్మాయిలే గిఫ్ట్స్ ఇస్తారు.

3.ప్రపంచంలో వెన్నను కెనడా వాసులు ఎక్కువగా తింటున్నారు.

4.ప్రింగిల్స్ సృష్టికర్త ఫ్రెడ్‌రిక్ బార్ 2008లో చనిపోయాడు.ఆయన కోరిక ప్రకారమే ఆయన్ని ప్రింగిల్స్ క్యాన్‌లో సమాధి చేశారు పిల్లలు.

5.భూకంపాలను పాములు తొందరగా పసిగట్టగలవు.120 కిలోమీటర్ల అవతల ఉండగానే ఇవి గుర్తించగలవు.ఓ ఐదారు రోజుల ముందుగానే భూకంపం రాబోతోందని తెలుసుకొని, అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాయి.

6.యాపిల్, పీచ్, రాస్ బెర్రీ పండ్లు.గులాబీ జాతికి చెందినవి.అలాగే స్ట్రాబెర్రీ అనేది బెర్రీ కాదు.అరటిపండు బెర్రీ జాతికి చెందినది.

7.బ్రెయిన్ సైజును బట్టీ ఆవలింత సైజ్ ఉంటుంది.చిన్న మెదడు ఉన్న ప్రాణులకు చిన్న ఆవలింత వస్తుంది.పెద్ద మెదడు ఉన్న జీవులకు పెద్దగా వస్తుంది.

8.వారానికి 3 గంటల పాటు వీడియో గేమ్స్ ఆడే సర్జన్లు, ఆడని వారి కంటే 27% ఎక్కువ వేగంతో, 37% తక్కువ తప్పులతో సర్జరీలు చేయగలరు.

9.బహమాస్‌లో మనుషులు తిరగని దీవి ఒకటుంది.దానిపేరు పిగ్ బీచ్.అక్కడ కేవలం పందులు మాత్రమే ఈత కొడుతూ ఉంటాయి.

10.లాలాజలం లేకపోతే, మనుషులు ఆహారాన్ని రుచి చూడలేరు.

11. రాక్షసబల్లులు భారీ రాళ్లను మింగేవి.ఆ రాళ్లు కడుపులో ఉండి, ఆహారం అరిగేందుకు ఉపయోగపడేవి.

12.ఫిబ్రవరి 18, 1979లో సహారా ఎడారిలో 30 నిమిషాలపాటూ మంచు కురిసింది.

13.స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 తర్వాత టాయిలెట్‌ని ఫ్లష్ చెయ్యడం చట్ట విరుద్ధం.

14. కాలిఫోర్నియాలో వెళ్లాల్సిన వేగం కంటే చాలా తక్కువ వేగంతో బండి నడిపితే.కేసు నమోదు అవుతుంది.

15.భూమిపై జీవించివున్న అతిపెద్ద జీవి ‘జైంట్ సెకోయా కోనిఫెరస్’ చెట్టు.దాని పేరు జనరల్ షెర్మన్

16.తన అస్థిపంజరాన్ని ఎవరూ కదపకుండా ఉండేందుకు విలియం షేక్‌స్పియర్.తన సమాధి రాయిపై ఓ శాపాన్ని రాయించుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube