డామినేట్ చేస్తుందని అప్పట్లో జెనీలియాను రిజెక్ట్ చేశాడు.. ఇప్పుడు తెరమీదే లేడు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నటి జెనీలియా.తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లరి అమ్మాయి గా కూడా పేరు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది.ఇదిలా ఉంటే అప్పట్లో ఈమెను ఓ హీరో రిజెక్ట్ చేశాడు.

 Genelia Was Rejected At The Time For Dominating Now He Is No More Present On The-TeluguStop.com

తొలిసారిగా హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైంది జెనీలియా.ఆ తరవాత తమిళ ఇండస్ట్రీకి పరిచయం కాగా అదే ఏడాది సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇక ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకోగా.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాలో నటించింది.ఇక వరుసగా నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, సై, హ్యాపీ, రామ్, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్, శశిరేఖ పరిణయం, నా ఇష్టం వంటి పలు సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఏ హీరోలు కాదనలేదు.

పైగా తనను బాగా సెంటిమెంట్ గా భావించేవాళ్ళు.కానీ ఓ హీరో మాత్రం జెనీలియాను రిజెక్ట్ చేశాడు.

కారణం ఏంటంటే ఆమె తనను డామినేట్ చేస్తుంది అని తనతో మరో సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు తరుణ్.

Telugu Dominat, Genelia, Tarun, Ritesh Deshmukh, Seshirekha, Tarun Genelia, Toll

తరుణ్ తో కలిసి శశిరేఖ పరిణయం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఆ సినిమాలో ఆమె పాత్ర బాగా డామినేట్ చేయడం వల్ల తన గుర్తింపు పోయిందని రిజెక్ట్ చేశాడు.అంతేకాకుండా సిద్ధార్థ నటించిన బొమ్మరిల్లు సినిమాలో కూడా జెనీలియా పాత్రకే ఎక్కువ పేరు వచ్చింది అని అందుకు ఆమెకే ఎక్కువ డిమాండ్ వస్తుంది అని కావాలంటే పెద్ద హీరోయిన్ ని అయినా ఒప్పిస్తాం కానీ ఆమె మాత్రం వద్దని ఓపెన్ గా చెప్పేశాడు.

Telugu Dominat, Genelia, Tarun, Ritesh Deshmukh, Seshirekha, Tarun Genelia, Toll

కానీ ప్రస్తుతం జెనీలియా రేంజ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది.కానీ అతడు మాత్రం ఇప్పుడు టాలీవుడ్ తెర మీదనే కనిపించకుండా ఉన్నాడు.జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Telugu Dominat, Genelia, Tarun, Ritesh Deshmukh, Seshirekha, Tarun Genelia, Toll

ఇక జెనీలియా తన భర్తతో కలిసి బాగా ఫన్నీ వీడియోలు చేస్తూ వాటిని తన అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఆ వీడియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా తనకు తెగ లైకులు కూడా కొడుతుంటారు.ఇక త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి జెనీలియా రీ ఎంట్రీ ఉంటుందని గతంలో వార్తలు కూడా వినిపించాయి.అది కూడా హీరో రామ్ సరసన మరోసారి నటించడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.

కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube