పాపం.. ఆ గ్లాస్ తో కనిపించడంతో జెనీలియాని తాగుబోతును చేశారు.. కానీ ఆమె?

Genelia Was Made Drunk By Appearing With That Glass But She

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లరి పిల్లగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ జెనీలియా. తాను తెలుగులో నటించిన కొన్ని సినిమాలైనా సరే మంచి సక్సెస్ ను అందుకుంది.

 Genelia Was Made Drunk By Appearing With That Glass But She-TeluguStop.com

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Genelia Was Made Drunk By Appearing With That Glass But She-పాపం.. ఆ గ్లాస్ తో కనిపించడంతో జెనీలియాని తాగుబోతును చేశారు.. కానీ ఆమె-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జెనీలియా సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా హిందీ సినిమాతో అడుగుపెట్టింది.

అదే ఏడాది తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.తెలుగు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా సత్యం సినిమాతో పరిచయమైంది.

ఆ తర్వాత హ్యాపీ, బొమ్మరిల్లు, శశిరేఖ పరిణయం వంటి పలు సినిమాలు తనకు మంచి గుర్తింపునిచ్చాయి.

చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించింది.ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2012లో నా ఇష్టం సినిమాలో నటించి ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.మళ్లీ అప్పటినుంచి టాలీవుడ్ లో అడుగు పెట్టలేదు.

Telugu Bollywood, Drunk, Film Industry, Genelia, Genelia Tollywood Entry, Genelia With Wine Glass, Glass, Hero Ram Pothineni, Heroine, Husband Ritesh Deshmukh, Tollywood-Movie

అలా బాలీవుడ్ లో సెటిలైన ఈ ముద్దుగుమ్మ మరో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే జెనీలియాకు ఫ్రెండ్స్, పార్టీస్, ట్రిప్స్ అన్నీ ఎక్కువే.

అలా ఓసారి తాను ఓ పబ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండగా అందులో ఆమె మందు గ్లాస్ తో దర్శనమిచ్చింది.

దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ విషయం ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా కొన్ని హిందీ పత్రికలు కూడా తనను బాగా అల్లరి పెట్టాయి.అయితే ఈ విషయం గురించి గతంలోనే స్పందించగా తనను కావాలనే ఇలా ఇరికించారు అంటూ దీని వెనకాల ఎవరు ఉన్నారో అర్థం కావట్లేదని తెలిపింది.

Telugu Bollywood, Drunk, Film Industry, Genelia, Genelia Tollywood Entry, Genelia With Wine Glass, Glass, Hero Ram Pothineni, Heroine, Husband Ritesh Deshmukh, Tollywood-Movie

అంతేకాకుండా తనకు అసలు మందు వాసననే తెలీదు అయినా తనను తాగుబోతుని చేశారంటూ బాగా మండిపడింది.అలా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయలేదు.ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన జెనీలియా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Telugu Bollywood, Drunk, Film Industry, Genelia, Genelia Tollywood Entry, Genelia With Wine Glass, Glass, Hero Ram Pothineni, Heroine, Husband Ritesh Deshmukh, Tollywood-Movie

తన భర్త రితేష్ తో ఫన్నీ వీడియోలు చేస్తూ వాటిని బాగా షేర్ చేస్తుంది.తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇటీవలే ఈ విషయం గురించి పలు వార్తలు కూడా వచ్చాయి.అంతే కాకుండా మరో సారి హీరో రామ్ తో కలిసి జతకట్టనున్నట్లు తెలియగా.

అందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ అభిమానులు మాత్రం జెనీలియా కోసం ఎదురు చూస్తున్నారు.

#Genelia #Ritesh Deshmukh #Glass #Ram Pothineni #Drunk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube