ఎన్టీఆర్‌కు హాసిని అక్కగానా..? అత్తగానా?  

Genelia Trivikram Ntr - Telugu Bommarillu, Chiranjeevi, Genelia, Lucifar, Ntr, Tollywood, Trivikram

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకునే హీరోయిన్స్‌ కొద్ది మంది ఉంటారు.వారిలో జెనీలియా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Genelia Trivikram Ntr

తెలుగులో దాదాపుగా పదేళ్ల కాలం పాటు ఎన్నో సూపర్‌ హిట్స్‌ చేసింది.ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో ఈమె చేసిన నటన మరియు ఆమె చూపించిన అల్లరి సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది.

గత 10 ఏళ్ల కాలంగా పెళ్లి పిల్లల కారణంగా సినిమాలకు దూరం అయిన జెనీలియా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ఎన్టీఆర్‌కు హాసిని అక్కగానా.. అత్తగానా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మెగాస్టార్‌ చిరంజీవి చేయబోతున్న లూసీఫర్‌ చిత్రంలో కీలక పాత్ర కోసం జెనీలియాను సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ చేయబోతున్న సినిమాలో కూడా జెనీలియా కీలక పాత్రలో నటించేందుకు సిద్దం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

కాని త్రివిక్రమ్‌ తన గత చిత్రాల్లో సీనియర్‌ హీరోయిన్స్‌ను రీ ఎంట్రీ చేపించాడు.అందుకే ఈ సినిమాతో జెనీలియాను రీ ఎంట్రీ చేపిస్తాడేమో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం త్రివిక్రమ్‌కు డేట్లు ఇవ్వబోతున్నాడు.వచ్చే ఏడాది ఈ కాంబో మూవీ రాబోతుంది.అరవింద సమేత చిత్రంతో మెప్పించలేక పోయిన వీరు ఈ చిత్రంతో హిట్‌ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.ఇక ఎన్టీఆర్‌కు హాసిని ఈ చిత్రంలో అక్కగా నటించబోతుందా లేదంటే అమ్మగా లేదా అత్తగా కనిపించబోతుందా అంటూ సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు