చిరు సినిమాలో రీఎంట్రీ ఇస్తానంటోన్న హాసిని

ఒకప్పడు స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేసిన బ్యూటీలు కాలక్రమంలో క్యారెక్టర్ పాత్రలకు మారి, ఆ తరువాత కనుమరగైన వారు చాలా మంది ఉన్నారు.కొందరు మాత్రం హీరోయిన్‌గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని తమ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి హ్యాపీ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు.

 Genelia To Make Comeback With Chiranjeevi Movie, Genelia, Chiranjeevi, Lucifer,-TeluguStop.com

కాగా కొందరు హీరోయిన్లు పెళ్లితో బ్రేక్ తీసుకుని, ఆ తరువాత క్యారెక్టర్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపి తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి మళ్లీ తమ కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన బ్యూటీ జెనీలియా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌ను బాగా ఆకట్టుకున్న ఈ చిన్నది తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేసి తన అమాయకమైన చూపులతో ప్రేక్షకులను మెప్పించింది.అయితే బాలీవుడ్ హీరో రితేష్ దేష్‌ముఖ్‌తో పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైన జెనీలియా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ అనే మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు పనులు ముగిసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో జెనీలియాను తీసుకోవాలని సుజీత్ అనుకుంటున్నాడు.ఆమె పేరును చిరుకు చెప్పగా, ఆయన కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది.

ఇక లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పనులు జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మరి ఈ సినిమాలో జెనీలియా నటిస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube