ఐదునిమిషాలైనా సరే అలాంటి పాత్రలకు సై అన్న జెనీలియా.. కానీ?

Genelia Said For Five Minutes Movie Offers

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకున్న నటి జెనీలియా.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

 Genelia Said For Five Minutes Movie Offers-TeluguStop.com

ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది.ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.

ఇదిలా ఉంటే ఐదు నిమిషాలే అయినా సరే అలాంటి పాత్రలకు సై అన్నది జెనీలియా.

 Genelia Said For Five Minutes Movie Offers-ఐదునిమిషాలైనా సరే అలాంటి పాత్రలకు సై అన్న జెనీలియా.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.అదే ఏడాది తెలుగు, తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది.సత్యం సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సాంబ, హ్యాపీ, బొమ్మరిల్లు, శశిరేఖ పరిణయం వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక హిందీలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో బాగా అభిమానులను సంపాదించుకుంది.2012లో నా ఇష్టం సినిమాలో చివరిసారిగా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి మలిపింది.అలా అక్కడే సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ మరో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

మళ్లీ అప్పటినుండి సినిమాలో అడుగు పెట్టక పోగా మళ్లీ రీ ఎంట్రీ కోసం ఈమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.గతంలో తాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

తనకు ఏ సినిమాలోనైనా అవకాశం వస్తే ఆ సినిమాలో తనకు పాత్ర పరిధి తక్కువగా ఉన్న ఆ పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే ఐదు నిమిషాలు మాత్రమే పాత్రలో కనిపిస్తానని చెప్పినా కూడా సై అని గతంలో తెలిపింది.

పారితోషకం కంటే పాత్ర గొప్పదని అద్భుతంగా తెలిపింది.

ఇక తెలుగు సినీ పరిశ్రమ తనకు ఇల్లు లాంటిదని ఇక్కడ వాళ్లతో 7 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపింది.తను ఏ భాషలో నటించిన కూడా ఆ భాషను అర్థం చేసుకొని నటిస్తానని ముఖ్యంగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది జెనీలియా.

ఇక తన పెళ్లి తర్వాత జెనీలియా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.

సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది.నిత్యం తన భర్త తో చేసిన ఫన్నీ వీడియోలను, తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంట క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకుంది.

తన ఇద్దరు కొడుకుల ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది జెనీలియా.

ఇదిలా ఉంటే త్వరలోనే తను టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొన్ని రోజుల కిందట బాగా వార్తలు వినిపించాయి.అంతేకాకుండా యంగ్ హీరో రామ్ తో మరోసారి నటిస్తుందని పైగా ఆ సినిమా గురించి వివరాలు కూడా తెలుపుతామని గతంలో ప్రకటించారు.ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉందో మాత్రం తెలియదు.

#Genelia #Genelia #Genelia #Genelia Enty #Genelia Offers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube