ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టనున్న హా..హా... హాసిని!

టాలీవుడ్ లో ‘బొమ్మరిల్లు’ చిత్రం లో హ.హా.హాసిని గా మెప్పించి ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా మెప్పించిన జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని ముంబై లో సెటిల్ అయ్యింది.

 Genelia Couple Entering Into The Food Business, Genelia, Ritesh Deshmukh, Food B-TeluguStop.com

ప్రస్తుతం త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన జెనీలియా భర్త రితేశ్ తో కలిసి ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది.అయితే మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అన్న వినూత్న నిర్ణయం తో ఈ జంట బిజినెస్ లో అడుగుపెట్టనుంది.

గత నాలుగేళ్లుగా మాంసాహారానికి స్వస్తి పలికిన ఈ జంట ఈ నాలుగేళ్లుగా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఉండే కొన్ని మొక్కలను వాడుతూ ఉంటారు.అంటే రుచిలోనూ,వాసనలోనూ,పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి.

గత నాలుగు సంవత్సరాలుగా ఈ జంట వాటినే ప్రత్యామ్న్యాయంగా తమ డైట్ లో వాడుతున్నారు.అయితే, ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని ఇండియాలో ఉత్పత్తి చేయాలని జెనీలియా దంపతులు భవిస్తూ ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ‌ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్ ‌తో కలిసి ఇమేజిన్ మీట్ పేరుతో ఇండియాలో బిజినెస్ ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక మాంసాహారానికి ప్రత్యామ్న్యాయంగా ఈ ఫుడ్ ఉండబోతుంది.ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్ధాలు కూడా అంతే రుచిగా తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.

శాకాహారిగా వెళ్లడం ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనది మరియు పర్యావరణానికి కూడా మంచిదని చాలా మంది బాలీవుడ్ నటులు శాకాహారిగా మారుతున్నారు మరియు ‘ప్లాంట్ బేస్డ్’ ఆహారాలతో వెళ్లాలని వారి అభిమానులకు కూడా సలహా ఇస్తున్నారు.ఈ క్రమంలోనే జెనీలియా జంట ఈ రమైన ఆహారపదార్ధాలను ఇండియా లో కూడా అందరికి అందుబాటులో ఉంచాలి అంటూ ఈ బిజినెస్ కు శ్రీకారం చుట్టనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube