జెనిలియా కొత్త అవతారం

సినీరంగంలో పీఆర్వో చేసే పనులేంటో తెలుసు కదా.ఎవరి దగ్గరైతే పనిచేస్తారో, వారి బాధ్యతలన్ని చూసుకునేది వారే.

 Genelia Is New Pro For Ritesh Deshmukh-TeluguStop.com

సినిమా ప్రమోషన్లు ప్లాన్ చేయాలన్నా, మీడియాలో కథనాలు తాము చెప్పినట్టు పడాలన్నా, షూటింగ్ షెడ్యూల్లు, డేట్స్, ఫైనాన్షియల్ వ్యవహారాలు .ఇలా అన్ని పీఆర్వోలే దగ్గరుండి చూసుకుంటారు.ఈరోజుల్లో ప్రతి సినిమా తారకి సొంత పీఆర్ టీమ్ ఉంటోంది.

బాలివుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తెలుసు కదా.అదే మన జెనిలీయా భర్త.ఇప్పుడు రితేష్ కి పీఆర్వో లాగా జెనిలియా వ్యవహరిస్తోందట.

రితేష్ కెరీర్ కి సంబంధించి ప్రతి విషయం అమ్మడే చూసుకుంటోందట.స్క్రిప్టు విషయాలు, ప్రొడక్షన్ విషయాలు, అన్ని సమర్థంగా మేనేజ్ చేస్తోందట.

” జెనిలియా ప్రొడక్షన్ పనులు చాలా చురుగ్గా పూర్తి చేస్తూ ఉంటుంది.టెక్నిషియన్స్ కి అందాల్సిన పేమెంట్ కూడా తనే చూసుకుంటుంది.

సినిమా యూనిట్ కి ప్రయాణ వసతులు, విడిది వసతులు, ఇలా అన్ని చూసుకునేది జెనిలియానే ” అంటూ భార్య పనితనాన్ని మురిసిపోతూ చెప్పాడు రితేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube