తెలుగులో ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ దర్శకత్వం వహించిన “సత్యం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “జెనీలియా డీ సౌజా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సత్యం చిత్రం మంచి హిట్ అవడంతో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నితిన్, సిద్దార్థ, రానా తదితర హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.
అంతేగాక అడపాదడపా బాలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తూ అక్కడ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది.
అయితే తాజాగా హీరోయిన్ జెనీలియా కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే జెనీలియా చిన్నప్పుడు తన పాఠశాలలో చదువుతున్న సమయంలో ఈ ఫోటోలను తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాక చదువులోనే గాక ఆటలలో కూడా జెనీలియా చురుగ్గా ఉండటం తో పలు బహుమతులను గెలుచుకుంది.
ఈ బహుమతులతో కలిసి తీసుకున్న ఫోటోలను జెనీలియా అభిమానులు సోషల్ మీడియా మాద్యమాలలో షేర్ చేస్తూ ట్రేండింగ్ చేస్తున్నారు. అంతేగాక జెనీలియా స్కూల్ యూనిఫామ్ దుస్తులలో చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే జెనీలియా బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో మరియు ప్రొడ్యూసర్ రితీష్ దేశ్ ముఖ్ ని 2012 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అడపాదడపా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
అయితే తెలుగులో చివరగా టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటించినటువంటి “నా ఇష్టం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో జెనీలియా నటించలేదు.