గర్భంతో కనిపించిన టాప్ హీరోయిన్

ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ జెనిలియా, బాలివుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.2012 లో జరిగిన పెళ్లి తరువాత సినిమాలు పూర్తిగా వదిలేసిన జెనిలియా, 2014 నవంబరులో ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది.ఆ బాబు పేరు రియాన్.గత కొన్ని రోజులుగా జెనిలియా మళ్ళి గర్భం దాల్చినట్టు వార్తలు వస్తున్నాయి.కాని జెనిలియా అప్పటినుంచి బయటకి రాకపోవడంతో అందులో ఎంతవరకు నిజం దాగుంది అనేది తెలియరాలేదు.

 Genelia Clicked With A Baby Bump-TeluguStop.com

అదే సమయంలో జెనిలియా సన్నిహితులు ఈ విషయాన్ని చెప్పినా, కంటికి కనబదేదాకా ఏది నమ్మకుడదని మీడియా కుడా దీన్ని మరి ఎక్కుపెట్టి చూపించలేదు.

భర్త రితేష్ కుడా ఈ విషయంపై స్పందించలేదు.అలాగే జెనిలియా కుడా ఎక్కువగా బయట కనబడకుండా జాగ్రత్తపడిం.

కాని విషయం ఎన్ని రోజులని దాగి ఉంటుంది.

మొన్న తన భర్త రితేష్ తో పాటు, బాలివుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ తో ఒక రెస్టారెంట్ కు వెళ్ళిన జెనిలియా ఇలా మీడియా కంటికి చిక్కింది.

ఇక ఈ చిత్రం చూడగానే జెనిలియా మళ్ళి గర్భం దాల్చిందనే విషయం కన్ఫర్మ్ అయిపొయింది.మొత్తానికి ఏడాది తిరక్కుండానే మళ్ళి తన అభిమానులకి తీపి కబురు అందించింది జేనిలియా.

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జెనిలియా తన బిడ్డకు జన్మనివ్వొచ్చు అని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube