మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న బొమ్మరిల్లు హాసిని  

సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా. .

Genelia Announces Her Re Entry In South-

టాలీవుడ్ లో సై సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకున్న ముద్దుగుమ్మ జెనీలియా.ఇక జెనీలియా కెరియర్ లో గుర్తుండిపోయే పాత్ర అంటే బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్ర.

Genelia Announces Her Re Entry In South--Genelia Announces Her Re Entry In South-

ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు జెనీలియాని హాసిని పాత్రలోనే ఊహించుకుంటారు.అంతలా ఆ పాత్రతో టాలీవుడ్ ప్రేక్షకులని జెనీలియా మెస్మరైజ్ చేసింది.ఈ భామ బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన సౌత్ లో ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అయితే సినిమా అవకాశాలు భాగానే ఉన్న సమయంలో తాను ప్రేమించిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా పేకప్ చెప్పేసింది.

ఇక ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా ఫ్యామిలీ జీవితానికి పరిమితమైపోయిన జెనీలియా మరల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉందని తెలుస్తుంది.పెళ్లి తర్వాత ఇప్పటికే 2 హిందీ సినిమాలతో పాటు ఓ మరాఠీ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన జెనీలియా త్వరలో ఓ మరాఠీ సినిమా తో పాటు తెలుగు తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మరి ఇప్పటికి జెనీలియా అంటే అందరికీ బొమ్మరిల్లు హాసిని పాత్రనే గుర్తొస్తుంది.మరి రీ ఎంట్రీలో ఈ భామ ఒకప్పటి క్రేజ్ ని తిరిగి ఏమాత్రం అందుకని తిరిగి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుతుంది అనేది వేచి చూడాలి.