మళ్ళీ గర్భవతి అయిన హీరోయిన్

హహ హాసిని అంటూ, తెలుగు ప్రజలను మురిపించింది జెనిలియా.పేరుకి బాలివుడ్ భామే అయినా, సినిమాలు ఎక్కువగా దక్షిణాదిలోనే చేసింది.

 Genelia Is Pregnant Again-TeluguStop.com

హింది, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ తన మొదటి చిత్రం తుఝే మేరి కసమ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లాడింది.

పెళ్లి తరువాత సినిమాలు పూర్తిగా వదిలేసిన జెనిలియా, 2014 నవంబరులో ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది.

ఆ బాబు పేరు రియాన్.ఇక కొత్తగా వినబడుతున్న వార్త ఏమిటంటే మన హాసిని మళ్ళి గర్భం దాల్చిందట.

బుల్లి రియాన్ కి త్వరలోనే ఓ తమ్ముడు లేదా చెల్లి రాబోతున్నారట.

హింది సినీ జర్నలిస్టు ఒకరు మాట్లాడుతూ ” అవును, జెనిలియా ప్రస్తుతం గర్భవతి.ఈ విషయం పట్ల రితేష్, జెనిలియా చాలా సంతోషంగా ఉన్నారు.2016 మొదట్లోనే జెనిలియా తన బిడ్డకి జన్మనివ్వబోతోంది ” అంటూ జెనిలియా ప్రెగ్నెన్సిని కన్ఫర్మ్ చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube