8 ఏళ్లకే జెండర్ రివీల్ పార్టీ.. గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన తల్లిదండ్రులు..!

తనకు పుట్టిన పాప ట్రాన్స్ జెండర్ అని తెలిస్తే మనం బాధకు లోనవుతాం.దానిని బయటికి చెప్పుకోవాలంటే ఎంతో మదన పడతాం.

 Gender Reveal Party For 8 Years Old Parents Gave A Grand Party,  Zender Revel Pa-TeluguStop.com

కానీ ఓ కెనడియన్ ఫ్యామిలీ ఎనిమిదేళ్లకే తన కూతురికి జెండర్ రీవిల్ పార్టీ ఇచ్చి వైభవంగా నిర్వహించారు.ఆరేళ్ల వయస్సులోనే తన కూతురు తాను అమ్మాయి మాదిరిగా ఫీల్ అవట్లేదని చెప్పడంతో తల్లిదండ్రులు అలోచనలో పడ్డారు.

కెనడాలోని ఒంటారియోకు చెందిన ఎల్లా స్కాట్.తల్లిదండ్రులైన నిక్కీ, గ్రాహమ్ కు మొదట విషయం చెప్పినప్పుడు కొంతకాలానికి అంతా సర్దుకుపోతుందని గ్రహించారు.

కానీ తొందరలోనే అందులోని అసలైన విషయాన్ని గుర్తించారు.తమ కూతురి స్వేచ్ఛాయుత జీవితానికి అడ్డు పడకూడదని ఉద్ధేశంతో గ్రాండ్ గా పార్టీ ఇచ్చి ప్రపంచానికి గొప్పగా పరిచయం చేశారు.

అయితే చిన్నతనంలోనే ఎల్లా అమ్మాయిలతో స్నేహం చేయడం, బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు.ఆమె అందరికంటే కొంచె భిన్నంగా ఉందని తెలుసుకున్నారు.అయితే ఆమె తన సోదరులతో కూడా ఆడుకోవడానికి ఇష్టపడలేదని తల్లి నిక్కి పేర్కొంది.ఆరేళ్ల వయస్సులోనే ఆమె స్కర్టుల వంటి అమ్మాయిల దుస్తులు ధరించేందుకు ఇష్టపడేది.దాన్ని వాళ్లు ఒక స్టేజ్ గా భావించారు.కానీ ఆ అలవాటే అలాగే కొనసాగింది.ఒక హాలోవీడన్ లో తననే సొంతంగా డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటే సర్ట్క్.పిల్లి చెవులతో కూడిన డ్రస్ ను ధరించింది.

అప్పుడు తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియక ఎల్లాకు కొన్ని ట్రాన్స్ వ్యక్తుల పుస్తకాలను చూపించారు.అప్పుడు నేను అబ్బాయిని కాదు.

నాకు లోపల అలా అనిపించడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది.దీంతో సైకాలజిస్ట్ ను సంప్రదించి వారు నిర్థారించుకున్నారు.

ఎల్లా స్కాట్ కు స్కూల్ టీచర్స్, తన ఫ్రెండ్ కూడా ఎంతగానో సహకరించారని వారు చెప్పుకొచ్చారు.దీంతో ఎనిమిదేళ్ల వయస్సులో ఇలాంటి పార్టీ ఇవ్వడం ఎక్కడా చూడలేదని చాలామంది అభిప్రాయాలను పాజిటివ్ గా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube