భర్త ఉద్యోగానికి వెళ్ళాక ఆ భార్య ఏం చేసిందో తెలుస్తే నోరెళ్లబెడతారు.! భర్త ఎగతాళి చేసినందుకు?  

Gemma Chalmers Makes Epic Timelapse Video To Show Her Husband-

ఉదయం మేం అందరం వెళ్లిపోయినప్పటి నుండి ఇంక నీకేం పని .హ్యాపి గా పొద్దంతా పడుకుంటావ్..

Gemma Chalmers Makes Epic Timelapse Video To Show Her Husband--Gemma Chalmers Makes Epic Timelapse Video To Show Her Husband-

బయట తిరిగే మాకు రెస్ట్ ఎక్కడిది అనే మాట ప్రతి ఇంట్లో.ప్రతిరోజు ప్రతి భర్త.ప్రతి భార్యని ఉద్దేశించి అంటూనే ఉంటాడు.

లేచిన దగ్గరనుంచి పడుకోబోయే దాకా ఎన్నో పనులతో సతమతమవుతూ కుటుంబాన్ని తన రెండు చేతుల మీదా నడిపిస్తున్న భార్యకు ఇలా ఎన్నో మాటల తూటాలు బోనస్ అన్నమాట.ఈ మాటలను భరించలేని ఒక భార్య,తన భర్తకు షాక్ ఇచ్చింది.ఎలాగో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు… .

స్కాట్లాండ్‌, అబర్దీన్‌కు చెందిన 35 ఏళ్ళ జెమ్మా ఛామర్స్‌ 12 గంటలపాటు తనను తాను వీడియో తీసుకుంది.అది ఏ ఫ్యాషన్‌ వీడియోనో అనుకుంటే పొరపాటే.ఆమె ఇంట్లో తాను చేసిన పనులను వరసపెట్టి వీడియో తీసింది.చివరికి దాన్ని ఎడిట్‌ చేసి 8 నిమిషాలకు కుదించింది.

ఇలా చేయడానికి కారణం జెమ్మా భర్త ‘నేను ఆఫీసుకు వెళ్ళాక చక్కగా ఎంజాయ్‌ చేయమని’ ఎగతాళిగా అనడమే! దాంతో తానేమీ ఖాళీగా కూర్చోవటం లేదని నిరూపించటానికి ఈ వీడియో తీసింది.తమ పిల్లాడి ఆలనాపాలనా దగ్గరనుంచి, ఇంటిపనుల వరకు అన్నీ… ఆ 8 నిమిషాల వీడియోలో ఉన్నాయి.మొత్తానికి ఇలాంటి మాటలు భరించలేని ఆడవాళ్ళకు ఒక కొత్తమార్గమే చూపించింది జెమ్మా!…

నిజమే ఇప్పుడు అంతా 4జి మయం.డోంట్ అండరెస్టిమేట్ ది లేడీస్.వాళ్లు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు.

అయినా ఒక మాట ఆడవాళ్లు కావాలంటే ఇంటిపని ,ఉద్యోగం కూడా చేయగలరు.కానీ అదే బాద్యత ఒక మగాడికి అప్పగిస్తే మాత్రం సమాధానం చేయలేడు అనే వస్తుంది.కాబట్టి మీరు వారికి ,వారి పనికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కనీసం మాటలతో హింసించకపోతే చాలు.