వి సినిమా ప్రసారం చేసిన లోకల్ ఛానల్ రెండు కోట్లు చెల్లించాలంట

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మల్టీ స్టారర్ చిత్రంగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వి.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల అయ్యింది.

 Gemini Tv Gives Notice For 2 Crore Fine To Local Channel, Tollywood, Telugu Cine-TeluguStop.com

దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని ఏకంగా 32 కోట్లకి అమెజాన్ లో డిజిటల్ రిలీజ్ కోసం అమ్మేశారు.అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

డివైడ్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమాకి కలెక్షన్ ఎంత వచ్చింది అనే విషయం బయటకి రాలేదు కాబట్టి సినిమా హిట్, ఫ్లాప్ అనే విషయాలని బెరేజు వేయడం కష్టం అవుతుంది.

ఇదిలా ఉంటె ఈ సినిమా శాటిలైట్ హక్కులని జెమిని చానల్ సొంతం చేసుకుంది.అయితే ఈ చానల్ లో ఇంకా ప్రీమియర్ షో వేయకుండానే చాలా చోట్ల లోకల్ చానల్స్ వి సినిమా ప్రసారం చేసేశాయి.

గతంలో కూడా చాలా సినిమాలు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న చానల్స్ లో ప్రసారం కాకముందే లోకల్ కేబుల్ చానల్స్ లో పైరసీ మూవీని ప్రసారం చేసేసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు జెమిని టీవీ యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

హైదరాబాద్‌లోని వి సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ చానల్ పై కేసు పెట్టింది.సదరు లోకల్ ఛానల్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా సినిమా టెలికాస్ట్ చేసినందుకు ఏకంగా 2 కోట్ల జరిమానా చెల్లించాలని జెమినీ యాజమాన్యం ఆ నోటీసులో పేర్కొంది.జరిమానా చెల్లించని పక్షంలో క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొంది.

ఇప్పుడు ఈ అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.జెమిని ఛానల్ తరహాలోని మిగిలిన ఛానల్స్ కూడా ఇకపై లోకల్ కేబుల్ చానల్స్ విషయంలో ఇదే పంథాలో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube