జెమినిని సావిత్రి పెళ్లి చేసుకోకుంటే..?       2018-05-24   22:23:55  IST  Raghu V

‘మహానటి’ చిత్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా సావిత్రి గురించి మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌, మాస్‌ ఆడియన్స్‌ అనే తేడా లేకుండా మహానటిని విపరీతంగా ఆధరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు అయినా కూడా ప్రతి ఒక్కరు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. మహానటి చిత్రంలో సావిత్రి గురించి ఎన్నో తెలియని విషయాలు వెళ్లడి అయ్యాయి. సావిత్రి చనిపోయిన సమయంలో మీడియా బలంగా లేదు. దాంతో అప్పటి విషయాలు జనాలకు తెలియలేదు.

సావిత్రి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చూపించే ప్రయత్నం చేసి ఆమె జీవితాన్ని కళ్లకు కట్టాడు. చివరి రోజుల్లో ఆమె పడ్డ బాధ, జెమిని గణేషన్‌ గురించిన విషయాలను దర్శకుడు చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. సావిత్రి తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుందని, జెమిని గణేషన్‌ను వివాహం చేసుకోవడం వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందని, అమాయకురాలు అయిన సావిత్రికి లేని తండ్రి ప్రేమను జెమిని చూపించి తన ముగ్గులోకి దించుకున్నాడు. ఒక వేళ సావిత్రి ఆయన్ను వివాహం చేసుకోకుంటే ప్రస్తుత పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉండేదంటూ ప్రచారం జరుగుతుంది.

జెమిని గణేషన్‌ను సావిత్రి వివాహం చేసుకోకుంటే మరో స్టార్‌ను లేదా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకునేది. వివాహం చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను హాయిగా కొనసాగించే వారు. అప్పట్లో హీరోల కంటే ఎక్కువగా సంపాదించిన సావిత్రి ఆస్తులు మరింతగా పెరిగేవి. జెమిని గణేషన్‌పై కోపంతో సావిత్రి ఎంతో మందిని నమ్మి మోసపోయారు. తన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో సావిత్రి ఆస్తులు దేశంలోనే ప్రముఖుల స్థానంలో ఆమెను నిలిపాయి. టాప్‌ 100 జాబితాలో ఆమె ఉండేది అంటే ఏ స్థాయిలో ఆమె శ్రీమంతురాలో అర్థం చేసుకోవచ్చు.

జెమినిని వివాహం చేసుకోకుండా ఉన్నట్లయితే ఆమె ఆస్తులు ప్రస్తుతం వంద రెట్టు ఎక్కువ అయ్యేవి. ఆమె పిల్లలు ఎంతో సంతోషంగా శ్రీమంతులుగా బతికేవారు. ప్రస్తుతం కూడా సావిత్రి పిల్లలు హ్యాపీ లైఫ్‌ను గడుపుతున్నారు. కాని ఆమె ఆస్తులు అన్ని కూడా ఉండి ఉంటే వారి రేంజ్‌ మరో రకంగా ఉండేదని చెప్పుకోవచ్చు. సావిత్రి జెమినిని కాకుండా మరెవ్వరిని వివాహం చేసుకున్నా కూడా ఆమె కొడుకు ఇండస్ట్రీకి వచ్చేవాడు. వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వ సాధారణం. సావిత్రి కూడా తన కొడుకును, ఆ తర్వాత మనవడిని ఇండస్ట్రీకి తీసుకు వచ్చేవారేమో అంటూ కొందరు ఊహాగాణాలు వ్యక్తం చేస్తున్నారు.