అయ్యో.. గీతూ రాయల్‌కు అలాంటి అనుభవం.. బాడీ షేమింగ్ అంటూ కన్నీళ్లు!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు గీతూ రాయల్‌గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ రివ్యూ లతో బాగా పాపులారిటి సంపాదించుకున్న గీతూ రాయల్ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలలో స్కిట్ లలో కామెడీ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే .

 Geetu Royal Cries Over Body Shaming , Geetu Royal , Body Shaming , Emotional , V-TeluguStop.com

ఇది ఇలా ఉంటే త్వరలోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా గీతు రాయల్ పాల్గొన బోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా గీతూ రాయల్‌ లైవ్ లోకి వచ్చి ఫుల్ ఎమోషనల్ అయ్యింది.

తనని చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్‌ చేస్తూనే ఉన్నారంటూ సుమారు గంట సేపు ఏడ్చేసింది గీతూ రాయల్‌.

తనని ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేమింగ్‌ చేశారని అందుకని నేను చాలా వరకు బాడీని కవర్‌ చేసేలా డ్రెస్సులు వేసుకుంటున్నాను ఆని చెప్పుకొచ్చింది.

ఈ మధ్యనే నేను నా కజిన్స్‌, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.అప్పుడు వాళ్ళు ముందు నువ్వు నీ బాడీని ప్రేమించు అని నాకు చెప్పారు.

కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను.జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి.

మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి అని తెలిపింది గీతూ రాయల్‌.దయచేసి బాడీ షేమింగ్‌ చేయొద్దు అంటూ ఏడ్చేసింది గీతూ.

అయితే ఈ వీడియో కాస్త తెగ వైరల్‌ అవ్వడంతో నువ్వు గతంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ షణ్నును బాడీ షేమింగ్‌ చేయలేదా? అతడిని తిట్టిపోయలేదా? అని ప్రశ్నిస్తున్నారు షణ్ను ఫ్యాన్స్‌.దీనిపై ఆమె స్పందిస్తూ.బిగ్‌బాస్‌ గేమ్‌ జడ్జ్‌ చేయడమే నా పని.అనగా మా వాడిని అన్నప్పుడు లేదా? అని తిడుతున్నారు షణ్ముఖ్ ఫ్యాన్స్.షణ్ముఖ్ బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు.ఎందుకంటే బిగ్‌బాస్‌ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.నేనేదో కావాలని సింపతీ క్రియేట్‌ చేస్తున్నానంటున్నారు.నాకేమీ చేతకాదు అని ఒప్పుకున్నప్పుడు సింపతీ క్రియేట్‌ చేస్తా.

ఇప్పుడు నాకు చాలా టాలెంట్‌ ఉంది.నాకీ సింపతీ అక్కర్లేదు అని తెలిపింది గీతూ రాయల్‌.

అలాగే పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్‌ అంటారు.కొంచెం మారండి అని ఘాటుగానే సమాధానమిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube