Geethika Tiwari : మధ్య ప్రదేశ్ అడవుల్లో అలాంటి టార్చర్ చూశానన్న అహింస హీరోయిన్.. అలాంటి పాత్రంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ తేజ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అహింస.ఈ సినిమాలో అభిరాం దగ్గుబాటి( Daggubati Abhiram ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.

 Geethika Tiwari About Ahimsa Movie-TeluguStop.com

ఇందులో గీతికా తివారీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్బంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

Telugu Ahimsa, Geethika Tiwari, Madhya Pradesh, Teja, Tollywood-Movie

ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా గీతికా తివారి ( Geethika Tiwari )మాట్లాడుతూ తన పాత్ర గురించి తెలిపింది.సంస్కృతి ప్రకృతి కుటుంబంతో ముడిపడిన కథ ఇది.ఇందులో అహల్య నా పాత్ర పేరు.ఇందులో అమాయకంగా కనిపిస్తాను.కానీ శక్తివంతమైన యువతిగా ఎదిగే తీరు ఆకట్టుకుంటుంది.ఆ పాత్ర గురించి తేజ చెబుతున్నప్పుడు లవ్ లో పడిపోయాను.ప్రేమపై నమ్మకమున్న అహల్యపడే కష్టాలు.

ఆమెకి ఎదురయ్యే సవాళ్లు సినిమాలో చాలా కీలకం.

Telugu Ahimsa, Geethika Tiwari, Madhya Pradesh, Teja, Tollywood-Movie

తేజ సర్ తనదైన శైలిలో రూపొందించారు.90 శాతం మధ్యప్రదేశ్ అడవుల్లోనే( Madhya Pradesh ) షూటింగ్ చేసాం.దట్టమైన అడవుల్లో షూటింగ్ ఇబ్బంది గా అనిపించినా తప్పలేదు.

సన్నివేశాలకు ఆలో కేషన్లు డిమాండ్ చేయడంతో కష్టం అయినా భరించాము.నిజంగా అదొక మంచి అనుభవం.

కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది.తొలి సినిమాతోనే నటులకు ఎదురయ్యే సవాళ్లని ఎదురయ్యాయి.

ఇక నా నేటివ్ ప్లేస్ కూడా ఎంపీనే.అక్కడే పుట్టి పెరిగాను.

డిగ్రీ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసాను.అయితే మొదట కొన్ని యాడ్స్ చేసాను అని చెప్పుకొచ్చింది గీతికా తివారీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube