న్యాయ పోరాటంకు సిద్దమవుతున్న గీతా మాధురి  

Geetha Madhuri Wants To Put Case On Who Was Puts Bad Of Her-

తెలుగు ప్రముఖ సింగర్‌ గీతా మాధురి తాజాగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో పాల్గొన్న విషయం తెల్సిందే. అంతా అనుకున్నట్లుగానే బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఫైనల్‌ వరకు వెళ్లింది. తాను ఎలా బయట ఎలా ఉంటుందో, ఇంట్లో కూడా అలాగే ఉన్న గీతా మాధురిపై కొందరు విమర్శలు చేసిన విషయం తెల్సిందే. బిగ్‌ బాస్‌ సమయంలో గీతా మాధురి మరియు సామ్రాట్‌లపై పుకార్లు పుట్టుకు వచ్చాయి. సామ్రాట్‌తో ఈమె నడుచుకుంటున్న తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు, మరి కొందరు ఇంకాస్త మసాలా దట్టించి యూట్యూబ్‌లో వీడియోలో పోస్ట్‌ చేశారు..

న్యాయ పోరాటంకు సిద్దమవుతున్న గీతా మాధురి-Geetha Madhuri Wants To Put Case On Who Was Puts Bad Videos Of Her

ఆ వీడియోలు గీతా మాధురి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయట. తనపై లేని పోని పుకార్లు పుట్టించిన వారిపై లీగల్‌ చర్యలకు సిద్దమవుతున్నట్లుగా ఆమె ప్రకటించింది. యూట్యూబ్‌లో తన గురించి ఉన్న వీడియోలను వెంటనే తీసేయాల్సిందే అని, లేదంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించింది. రెండు రోజుల్లో తాను లీగల్‌ గా కంప్లైంట్‌ ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

తన జీవితాన్ని తాను అనుకున్నట్లుగా అనుభవించనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. .

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఫైనలిస్ట్‌ అయిన గీతా మాధురి టాప్‌ 2లో నిలిచి రన్నరప్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే గీత మాధురిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం పీక్స్‌కు వెళ్తుంది. దాంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చర్యలకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది.

రెండు రోజుల్లో ఆమె తీసుకోబోతున్న చర్యలపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.