ప్రముఖ సింగర్ గీతామాధురి కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో?

టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో గీతామాధురి ఒకరనే సంగతి తెలిసిందే.రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన నచ్చావులే సినిమాలోని నిన్నే నిన్నే కోరా పాటతో గీతామాధురి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Geetha Madhuri Daughter Photos Goes Viral In Social Media, Geetha Amdhuri, Nand-TeluguStop.com

సూపర్ సింగర్ షో ద్వారా గీతామాధురి భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.హైదరాబాద్ లో చదువుకున్న గీతామాధురి బాల్యంలోనే సంగీతం నేర్చుకున్నారు.గీతా మాధురి పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

100% లవ్ సినిమాలో అజిత్ పాత్రలో నటించి గుర్తింపును సొంతం చేసుకున్న నందును గీతామాధురి 2014 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.గీతా మాధురి, నందు తాజాగా తిరుమల శీవారిని దర్శించుకున్నారు.నందు, రష్మీ కాంబినేషన్ లో తెరకెక్కిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుందని నందు వెల్లడించారు.

మరో రెండు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నందు చెప్పుకొచ్చారు.

Telugu Geetha Amdhuri, Geethamadhuri, Geetha Madhuri, Nandu-Movie

ఒక సినిమాకు తాను నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నానని నందు కామెంట్లు చేశారు. గీతామాధురి, నందు తిరుమలలో మొక్కులు చెల్లించుకున్నారు.తిరుమలలో దిగిన ఫోటోలలో గీతామాధురి నందుల కూతురు హైలెట్ గా నిలిచారు.

ఫోటోలను చూసి గీతామాధురి కూతురు క్యూట్ గా ఉందని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.గుండులోనూ గీతామాధురి కూతురు బాగున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Geetha Amdhuri, Geethamadhuri, Geetha Madhuri, Nandu-Movie

కొన్నేళ్ల క్రితం నందు, గీతామాధురి కలిసి అదితి అనే షార్ట్ ఫిలిమ్ లో నటించారు.ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని సమాచారం.ఆ షార్ట్ ఫిలిమ్ హిట్ కావడంతో పాటు నందు, గీతామాధురికి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆ తర్వాత గీతామాధురి, నందు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.గీతా మాధురి, నందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో తరచూ పంచుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube