అరియానాను చూసి జాలిప‌డుతున్న‌ గీతా మాధురి.. ఎందుకంటే?

తెలుగు మోస్ట్ పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్లు ప‌దో వారంలో ఉన్నారు.రోజు రోజుకు రంజుగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం తొమ్మిది మందే ఉన్నారు.

 Geetha Madhuri Comment On Ariyana Glory! Geetha Madhuri, Ariyana Glory, Latest N-TeluguStop.com

ఈ తొమ్మిది మందిలో అరియానా, మోనాల్‌, మెహబూబ్‌, అభిజిత్‌, సొహైల్ మ‌రియు హారిక‌లు నామినేష‌న్‌లో ఉన్నారు.అయితే ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అవినాష్ మిన‌హా.

మిగిలిన ఇంటి స‌భ్యులంద‌రూ అరియానానే టార్గెట్ చేసిన విష‌యం తెలిసిందే.అంద‌రూ టాస్కుల్లో జ‌రిగిన ఏదో ఒక విష‌యం చెప్పి.

ఆమె త‌ల‌పై బాటిల్‌ని పగలగొట్టి నామినేట్ చేశారు.

ఈ స‌మ‌యంలో అరియానా చాలా ఎమోష‌న్ అయిపోయింది.

అయితే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండే అరియానా.టాస్కుల్లో కూడా అద్భుత‌మైన ప్రదర్శన ఇస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంగ్ మారింది.

ఈ క్ర‌మంలోనే మొద‌ట్లో సెటైర్లు వేసిన ప్రేక్ష‌కులే.ఆమె ఆట తీరు న‌చ్చ‌డంలో నామినేష‌న్స్‌లో ఉన్న‌ప్పుడ‌ల్లా సేవ్ చేస్తూ వ‌చ్చారు.

ఇదిలా ఉంటే.తాజాగా అరియానాపై బిగ్ బాస్ సీజ‌న్ 2 కంటెస్టెంట్, సింగ‌ర్ గీతా మాధురి కొన్ని వ్యాఖ్య‌లు చేసింది.

Telugu Ariyana Glory, Bigg Boss, Geetha Madhuri, Latest, Tollywood-Latest News -

గీతా మాట్లాడుతూ.క్యూట్‌గా ఉండే అరియానా చాలా జన్యున్‌గా అనిపిస్తుంద‌ని.ఎదుట వ్యక్తికి ఏం చెప్పాలని అనుకుంటుందో.దాని చాలా ఓపిగ్గా మ‌రియు కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంద‌ని.ఎందులోనైనా స్టైట్ ఫార్వర్డ్‌గా ఉంటుంద‌ని.ఆ విషయంలో నాకు ఆమె చాలా బాగా నచ్చింద‌ని ప్ర‌శంస‌లు కురిపించింది.

అలాగే అరియానా చాలా మంచి అమ్మాయి.మ‌రియు ఆమెది ప్లెయిన్ హార్ట్ అనిపిస్తుంద‌ని గీతా తెలిపింది.

అయితే ఒక్కోసారి ఆమెను చూస్తే జాలేస్తుంద‌ని గీతా తెలిపింది.ఆమె కొన్ని సందర్భాల్లో టాస్కే జీవితం అని టాస్క్ ఎలాగైనా ఆడాలని.ఆడాల్సిన అవసరం లేకపోయినా ఆడుతోంది.ఈ క్ర‌మంలోనే మిగిలిన ఇంటి స‌భ్యులు ఆమెను నామినేట్ చేయాలని ఉండ‌క‌పోయినా.

నామినేట్ చేయాల్సి వ‌స్తుంది.దాంతో ఆమె చిక్కుల్లో ప‌డుతుంద‌ని గీతా అరియానాపై త‌న అభిప్రాయాన్ని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube