మన ముందు ఆ సినిమా ఇండస్ట్రీలు అన్నీ వేస్ట్ అంటున్న దర్శకుడు...   

Geetha Krishna Director Sensational Comments On Cine Industry - Telugu Director Geetha Krishna, Geetha Krishna, Geetha Krishna Mvoie News, Shoking Comments On Film Industry, Tollywood Director Geetha Krishna, Tollywood News

ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్, చిత్ర పరిశ్రమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా కోలీవుడ్ శాండల్ వుడ్ వంటి చిత్ర పరిశ్రమను కించ పరుస్తూ దేశంలోని అన్ని చలనచిత్ర పరిశ్రమలకి కింగ్ టాలీవుడ్ అంటూ, మిగిలిన వాళ్లంతా పులిహోరగాళ్లని అన్నారు.

Geetha Krishna Director Sensational Comments On Cine Industry - Telugu Mvoie News Shoking Film Tollywood

దీంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది.అంతేగాక ఈ రెమ్యునరేషన్  కోసమే నార్త్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోయిన్లు టాలీవుడ్ కి వస్తారని ఇక్కడ డిసైడ్ చేసినటువంటి పారితోషకాన్ని పెంచుకునేందుకు మళ్లీ బాలీవుడ్ వైపు వెళ్తారని అన్నారు.

అలాగే గతంలో తాను కూడా ఎంతో మంది హీరోలకు పిలిచి అవకాశాలు ఇచ్చానని ఇందులో ప్రస్తుతం తమిళనాడులో స్టార్ హీరో గా కొనసాగుతున్న టువంటి అజిత్ ఒకరని అన్నారు. అయితే అప్పట్లో అజిత్ నటించిన టువంటి వాలి చిత్రంతో అజిత్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని కానీ తనకు మాత్రం ఒరిగిందేమీ లేదని అన్నారు.

అయితే ఇలాగే ప్రభుదేవా కూడా కెరియర్లో ఎదగడానికి సహాయం చేశానని అన్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఫేమ్ సంపాదించిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడని అన్నారు.తెలుగులోనూ మరియు తమిళ్లోనూ దాదాపుగా 10 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించిన టువంటి గీతా కృష్ణ గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు.అయితే చాలా రోజుల తర్వాత సినీపరిశ్రమ వైపు చూసినటువంటి గీతాకృష్ణ వచ్చి రావడంతోనే ఇలా సినీ ఇండస్ట్రీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పలువురు సినీ ఇండస్ట్రీ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నాడు.

తాజా వార్తలు

Geetha Krishna Director Sensational Comments On Cine Industry-geetha Krishna,geetha Krishna Mvoie News,shoking Comments On Film Industry,tollywood Director Geetha Krishna,tollywood News Related....